Ice Pizza: నెటిజన్లకు నోరూరిస్తున్న ఐస్ పిజ్జా.. తయారీ పద్ధతి వెరైటీ గురూ!! మీరూ ఓ లుక్కేయండి..
ఓ విచిత్రమైన ప్రయోగంతో తయాతరు చేసిన వంటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అదేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోకుండా ఉండలేరు.
Ice Pizza: ప్రపంచంలో ఆహార ప్రియులకు కొదువే లేదు. ప్రపంచంలో ఏది దొరికితే అది తినేవాళ్ళు కూడా ఉన్నారు. మరికొందరు తాము ఎంచుకున్న ఆహారాన్ని మాత్రమే తింటారు. ఇకపోతే, ప్రయోగాత్మకంగా చేసే ఆహార పదార్థాలు కూడా ఈ రోజుల్లో చాలా ట్రెండింగ్ ఉంటున్నాయి. తాజాగా ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది . ఇందులో ఐస్ క్యూబ్స్, జున్ను ముక్కలు జోడించి పిజ్జా తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అలాంటి ఆహారాలతో ప్రయోగాలు చేసే వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తారు. ప్రజలు కూడా మ్యాగీ, మోమోస్ వంటి వంటకాలతో ప్రయోగాలు చేస్తూ కనిపిస్తారు. ఇప్పుడు అలాంటి ఓ విచిత్రమైన ప్రయోగంతో తయాతరు చేసిన వంటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అదేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోకుండా ఉండలేరు.
పిజ్జా.. చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఓ కొత్త రకం పిజ్జా తయారీ పద్ధతి వైరల్ అవుతోంది. అదే ఐస్ క్యూబ్ పిజ్జా. సాధారణ పిజ్జా తయారీ పద్ధతికి పూర్తి భిన్నమైన రీతిలో దీన్ని తయారు చేశారు. గోధుమ పిండి ముద్దను రొట్టెలా తయారు చేసి .. అందులోపల నాలుగైదు ఐస్ క్యూబ్ లు జమాయించారు. ఆ తర్వాత దాన్ని బేకింగ్ చేశారు. బేకింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఐస్ పిజ్జాలో తురిమిన జున్ను ముక్కలను నింపారు. దీంతో వెరైటీ ఐస్ పిజ్జాగా మారిపోయింది. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ఈ పిజ్జాను తయారు చేసి చూడండి.
“Does He Bake Dough” అనే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో దీనికి సంబంధించిన వీడియోను ఒక ఔత్సాహిక ఫుడీ పోస్ట్ చేశారు. ఇది ఇప్పటివరకు 7.8 మిలియన్ సార్లు వీక్షించబడింది, అయితే 1 మిలియన్ కంటే ఎక్కువ మంది వీడియోను కూడా లైక్ చేసారు. ఎంతోమంది ఆహార ప్రియులు ఈ వీడియోను ఆసక్తిగా చూస్తున్నారు. ఇతరులకు షేర్ చేస్తున్నారు. దాంతో వీడియో పెద్దఎత్తున వైరల్ అయింది.
View this post on Instagram
దీని తయారీని చూపించే వీడియోను చూసిన నెటిజన్స్ వివిధ రకాల కామెంట్స్ చేశారు. “ఒకసారి ఆ రెసైపీని మాకు షేర్ చేయండి” అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా..ఎందుకు.. మనుషులు మామూలుగా ఉండలేరు.. అసాధారణ ఆలోచనలతో అందరినీ ఇబ్బందులో పడేస్తుంటారు..అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు మరో నెటిజన్.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ ఇక్కడ క్లిక్ చేయండి