Viral: కలలో కనిపించిన నంబర్స్‌తో లాటరీ తీశాడు… ఎంత గెలుచుకున్నాడో తెలిస్తే స్టన్ అవుతారు

తనకు కలలో కనిపించిన నంబర్ల ఆధారంగా ఆ నంబర్లు ఉన్న లాటరీ టికెట్ కొనుక్కున్నానని... దానికై ప్రైజ్ మనీ వచ్చిందని అతను చెప్పడంతో స్టేట్ లాటరీ అధికారులు స్టన్ అయ్యారు.

Viral: కలలో కనిపించిన నంబర్స్‌తో లాటరీ తీశాడు... ఎంత గెలుచుకున్నాడో తెలిస్తే స్టన్ అవుతారు
Lottery
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 02, 2022 | 4:35 PM

Trending News: అమెరికా(USA)లో ఓ వ్యక్తి నక్కతోక తొక్కాడు. వర్జీనియా(Virginia)కు చెందిన అలోంజో కోల్ మాన్ అనే వ్యక్తికి నిద్రలో వచ్చిన కల సిరులు తీసుకొచ్చింది. అతనికి కలలో కొన్ని నంబర్స్ కనిపించాయి. ఉదయం లేచిన వెంటనే తన హోమ్ టౌన్‌లో ఉన్న చిన్న కార్నర్ మార్ట్‌ వెళ్లి అదే నంబర్ సిరీస్‌తో  “బ్యాంక్ ఎ మిలియన్” లాటరీ తీశాడు. ఊహించని విధంగా ఆ టికెట్‌పై ఉన్న నంబర్లకే లక్ తగిలింది. కేవలం 2 డాలర్లు పెట్టి టికెట్ కొనుగోలు చేయగా.. అతడికి 250,000 డాలర్ల లాటరీ జాక్‌పాట్‌ తగిలింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇంచుమించు కోటి 97 లక్షలు.  తనకు కలలో కనిపించిన నంబర్స్ ఉన్న లాటరీ టికెట్ కొనుక్కున్నానని… దానికే ప్రైజ్ మనీ వచ్చిందని అతను చెప్పడంతో స్టేట్ లాటరీ అధికారులు కూడా స్టన్ అయ్యారు.  13, 14, 15, 16, 17, 18 అనే నంబర్ సిరీస్ ఉండేలా  కోల్ మాన్ లాటరీ టికెట్ కొన్నాడు.  జూన్ 11 డ్రా తీసినప్పుడు  అవే నంబర్లకు లాటరీ తగిలింది. అయితే విన్నర్స్ ఎవరనేది లాటరీ అధికారులు ఈ గురువారం  ప్రకటించారు. బోనస్ బాల్ నంబర్.. 19 మిస్ అయ్యాడు కోల్ మాన్. ఆ నంబర్ కూడా తగిలివుంటే…ఇంకా ఎక్కువ డబ్బు వచ్చేది. దీంతో అతని ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఈ విషయాన్ని తాను నమ్మలేకపోతున్నానని అలోంజో కోల్ మాన్ చెబుతున్నాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి