Telugu News Trending Dog guarding a sleeping boy Video has gone viral on social media
Viral Video: మా బుడ్డోడు నిద్రపోతున్నాడు.. ఎవరైనా డిస్టర్బ్ చేసారో.. జాగ్రత్త
ఇంట్లో పెంపుడు కుక్కలు (Pet Dogs) అంటే ఆ ధైర్యం, భరోసానే వేరు. శునకాలు తమ యజమానులతో ఎంతో అనుబంధాన్ని పెంచుకుంటాయి. చిన్ని పిల్లలతో స్నేహం చేస్తాయి. వారితో కలిసి ఆడుకోవడమే కాదు.. వారికి ఎలాంటి ఆపద రాకుండా రక్షణగా....
ఇంట్లో పెంపుడు కుక్కలు (Pet Dogs) అంటే ఆ ధైర్యం, భరోసానే వేరు. శునకాలు తమ యజమానులతో ఎంతో అనుబంధాన్ని పెంచుకుంటాయి. చిన్ని పిల్లలతో స్నేహం చేస్తాయి. వారితో కలిసి ఆడుకోవడమే కాదు.. వారికి ఎలాంటి ఆపద రాకుండా రక్షణగా నిలుస్తాయి. తాజాగా ఓ చిన్నారి, కుక్కకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Social Media) చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఒక చిన్న బాలుడు మంచంపై నిద్రపోతున్నాడు. అతని పక్కనే వాళ్ల పెంపుడు కుక్క కూడా ఉంది. ఆ బాలుడు నిద్రపోతున్నప్పుడు ఆ కుక్క చిన్నారిని ఎంతో ఆప్యాయంగా చూస్తూ అతన్ని స్పర్శిస్తూ ఉంటుంది. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి ఆ బాలుడిని నిద్ర లేపబోతాడు. దాంతో ఆ కుక్క అతన్ని డిస్టర్బ్ చేయొద్దన్నట్టుగా అతని చేయిని పట్టుకొని వారిస్తుంది. ఈ క్యూట్ సన్నివేశం నెటిజన్ల మనసు దోచుకుంటోంది. ఈ వీడియోను ఓ యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్ (Instagram) లో షేర్ చేశారు.
ఈ వీడియోలో బాలుడితోపాటు పెంపుడు కుక్క మంచం మీద పడుకుని ఉంది. బాలుడిని కౌగిలించుకుని ఉంది. బాలుడు నిద్రపోతుండగా అతడికి కాపలా కాస్తుంది. బాలుడి తండ్రి అతడిని లేపేందుకు ప్రయత్నిస్తుండగా కుక్క వారించింది. చివరగా బాలుడు లేచి, కుక్కను హగ్ చేసుకొని ప్రేమగా దానికి ముద్దులు పెట్టాడు. ఈ హార్ట్ టచ్చింగ్ వీడియోను నెటిజన్లు చాలా ఇష్టపడుతున్నారు. లక్షల మంది వీక్షించగా వేలల్లో లైక్ చేస్తున్నారు.