Hindi in Russia: భారత్‌తో రష్యా సంబంధం మరింత బలం.. రష్యా విశ్వవిద్యాలయాల్లో హిందీ.. పెరుగుతున్న స్టూడెంట్స్
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నేటి వరకూ రష్యా దేశంలో ఉన్న బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు రాజకీయ విశ్లేషకులు. భారత దేశానికి నిజమైన మిత్రుడు రష్యా.. మన దేశానికి కష్టం వచ్చినా ఆపదలో ఉన్నా నేనున్నాను అంటూ ముందుకొస్తుంది. ఎటువంటి రష్యాతో కొంత కాలంగా మన దేశంతో బంధం మరింత బలపడుతోంది. ఆ దేశానికి చదువు, ఉద్యోగం కోసం వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుతున్న నేపధ్యంలో ఆ దేశ పరిపాల అధికారులు, విద్యా సంస్థలు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

భారతదేశంలో పెరుగుతున్న హిందీ వినియోగం, రష్యా స్వీకరించాల్సిన అవసరాన్ని డిప్యూటీ మంత్రి మోగిలేవ్‌స్కీ హైలైట్ చేశారు. మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్, కజాన్‌తో సహా అనేక విద్యా సంస్థల్లో పెరుగుతున్న విద్యార్ధులకు ఆసక్తికి అనుగుణంగా హిందీ కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నాయి. పెరుగుతున్న డిమాండ్ కారణంగా రష్యా విశ్వవిద్యాలయంలో హిందీని అధ్యయన అవకాశాలను గణనీయంగా విస్తరిస్తోంది.
అవును రష్యాలో విశ్వవిద్యాలయ స్థాయిలో హిందీని అభ్యసించే అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. భారతీయ భాషకు భారీ డిమాండ్ ఉందని సైన్స్, ఉన్నత విద్య డిప్యూటీ మంత్రి కాన్స్టాంటిన్ మొగిలేవ్స్కీ అన్నారు. తమ విద్యార్థులు ఎక్కువ మంది హిందీని అధ్యయనం చేయాలని కోరుకుంటున్నామని చెప్పారు. నేడు భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం. ఎక్కువ మంది భారతీయులు తమ దైనందిన జీవితంలో ఇంగ్లీషుకు బదులుగా హిందీని ఉపయోగించడం ప్రారంభించారు. దీనికి మనం స్పందించాలని రష్యా టుడే ఉటంకించినట్లుగా మొగిలేవ్స్కీ అన్నారు.
గత కొన్ని సంవత్సరాలలో రష్యన్ విద్యార్థులకు హిందీ పట్ల ఆసక్తి పెరిగిందని.. దీంతో తమ దేశంలో హిందీకి ఆదరణ పెరిగిందని ఆయన స్పష్టం చేశారు. నేడు హిందీని అభ్యసించాలనుకునే యువతకు మునుపటి కంటే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మాస్కోలో మాత్రమే GIMO, RSUH, మాస్కో స్టేట్ యూనివర్శిటీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆసియన్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్, మాస్కో స్టేట్ లింగ్విస్టిక్ యూనివర్సిటీలో హిందీని చదువుకునే అవకాశం ఉంది.
ఈ హిందీ భాషని చదువుకునే విద్యార్థుల సంఖ్య ఏడాది ఏడాదికి పెరుగుతోంది. హిందీ అభ్యాస అవకాశాలు మాస్కోకే పరిమితం కాలేదని.. రష్యా అంతటా ఉన్న సంస్థలు సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్శిటీ , కజాన్ ఫెడరల్ యూనివర్శిటీతో సహా వివిధ విద్యా సంస్థలు హిందీ కార్యక్రమాలను విస్తరిస్తున్నాయని చెప్పారు.
భారతదేశం, రష్యా మధ్య సంబంధాలు మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ దేశంలో హిందీ భాషా అభ్యాసం ఒక సంచలనా వార్తగా నిలిచింది. ఇటీవల ప్రధాని మోడీ చైనాలోని టియాంజిన్‌లో SCO శిఖరాగ్ర సమావేశంలో వ్లాదిమిర్ పుతిన్‌ను కలిశారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చల సందర్భంగా ప్రధాని మోడీ ఇరుదేశాల సంబంధంలో ఉన్న బలాన్ని నొక్కిచెప్పారు, కష్ట సమయాల్లో రెండు దేశాలు నిరంతరం ఒకదానికొకటి అండగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం న్యూఢిల్లీ.. మాస్కో మధ్య సహకారం చాలా ముఖ్యమైనదని ఆయన నొక్కి చెప్పారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
