Watch Video: ప్రాణాల మీదకు తెచ్చిన పందె.. మద్యం మత్తులో యువకుడు ఏం చేశాడంటే
కొన్ని సార్లు స్నేహితులతో సరదాకోసం పెట్టుకొనే పందేలాలు కొన్ని సార్లు వాళ్ల ప్రాణాలకే ప్రమాదకరణంగా మారుతాయి. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది. ఫ్రెండ్స్‌తో పందెం కాసి ఓ యువకుడు కారుతో సముద్రంలోకి వెళ్లి నీటిలో చిక్కుకుపోయాడు. అది గమనించిన మత్స్యారులు అతన్ని కాపాడి ఒడ్డుకు చేర్చారు. ఆ తర్వాత ట్రాక్టర్ సహాయంతో అతని వాహనాన్ని కూడా ఒడ్డుకు చేర్చారు.

స్నేహితులతో పందెం కాసి, ఓ యువకుడు ఏకంగా ప్రాణలమీదికే తెచ్చుకున్న ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో వెలుగు చూసింది. కారుతో సహా నీటిలో చిక్కుకుపోయిన యువకుడిని గమనించిన మత్సకారులు అతన్ని కాపాడి ఒడ్డుకు తెచ్చారు. కాగా ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ట్రాక్టర్ సహాయంతో వారి వాహనాన్నిఒడ్డుకు చేర్చారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడలూర్ హార్బర్-పరంగిపేట ప్రాంతానికి చెందిన కొందరు యువతీ యువకులు సరదాగా గడిపేందుకు స్థానికంగా ఉన్న సముద్ర తీరానికి వచ్చారు. ఈ క్రమంలో వారు సముద్రంలోకి ఎవరు కారు నడుపుతూ వెళ్తారని వారు పందెం వేసుకున్నారు. వారిలో ఒక యువకుడు తాను వెళ్తానని శపథం చేసి.. కారు తీసుకొని సముద్రంలోకి వెళ్లాడు. అయితే కారు నీటిలోకి కొంతదూరం వెళ్లగానే ఆగిపోయింది. దీంతో కారుతో పాటు ఆ యువకుడు కూడా నీటిలో చిక్కుకుపోయాడు.
అది గమనించిన అక్కడే ఉన్న కొందరు మత్స్యకారులు. వెంటనే ముద్రంలోకి దిగి నీటిలో చిక్కుకుపోయిన ఆ యువకుడిని రక్షించారు. ఆ తర్వాత వారి వివరాలు తెలుసుకొని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ట్రాక్టర్ సహాయంతో వారి వాహనాన్నిఒడ్డుకు చేర్చారు. అయితే అక్కడున్న యువతీ యువకులు మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్లను అక్కడి నుంచి పంపేశారు.
వీడియో చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
