Viral Video: రైల్వే క్రాసింగ్ వద్ద ఇరుక్కున కారు.. స్పీడ్ గా వచ్చిన ట్రైన్.. యాక్సిడెంట్ చూస్తే వెన్ను వణకాల్సిందే
రైల్వే గేటును దాటే సమయంలో నిర్లక్ష్యం వద్దు.. అక్కడ ఉన్న సిగ్నల్స్ చూసి గేటు దాటాలని.. అప్పుడే సురక్షితం అని ఎన్ని సార్లు చెప్పినా ప్రజలు లెక్క చేయడం లేదు. ప్రాణాల కంటే హడావిడిగా రైల్వే లైన్ దాటి తమ గమ్య స్థానానికి చేరుకోవడానికే ప్రయాణిస్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులను తరచుగా చూస్తూనే ఉంటాం. తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో మూసి ఉన్న రైల్వే గెట్ దాటడానికి ప్రయత్నిస్తుంటే జరిగిన ప్రమాదాన్ని చూపిస్తుంది.

రైల్వే గేట్ల వద్ద ప్రజల నిర్లక్ష్యం తరచుగా కనిపిస్తుంది. చాలా సార్లు గేట్ మూసివేసిన తర్వాత కూడా ప్రజలు త్వరగా త్వరగా రైలు పట్టాలు దాటడానికి ప్రయత్నిస్తారు. ఈ తొందరలో వారు ప్రమాదాలకు కూడా గురవుతారు. ఈ నిర్లక్ష్యం కొన్నిసార్లు చాలా ఖరీదైనదిగా మారుతుంది. ఒకొక్కసారి ప్రాణాలను కూడా కోల్పోయే అవకాశం ఉంది. అలాంటి ఒక వీడియో ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో రైల్వే గేట్ వద్ద నిర్లక్ష్యం ఎంత నష్టాన్ని కలిగిస్తుందో చూపిస్తుంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో .. రైల్వే గేటు వద్ద ఒక కారు ఎలా ఇరుక్కుపోయిందో.. ఆపై ఒక హైస్పీడ్ రైలు అక్కడికి ఎలా చేరుకుందో కనిపిస్తుంది. తర్వాత రెప్ప పాటులో ఏమి జరిగిందో చూసేవారికి వణుకు పుట్టించేలా ఉంది. వీడియోలో రైల్వే గేటు మూసివేయబోతున్నట్లు కనిపిస్తుంది.. అయితే అదే సమయంలో ఒక కారు డ్రైవర్ హడావిడిగా రైల్వే ట్రాక్ దాటడానికి ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో గేటు క్లోజ్ అయింది. దీంతో కారు మధ్యలో చిక్కుకుపోయింది. దీంతో డ్రైవర్ భయపడి కారును ట్రాక్ మీద నుంచి బయటకు వచ్చేలా ముందుకు.. వెనుకకు తరలించడానికి ప్రయత్నించాడు. అయితే డ్రైవర్ ప్రయత్నం ఫలించలేదు. ఇంతలో ఒక హైస్పీడ్ రైలు ట్రాక్‌పైకి వచ్చి కారును ఢీకొట్టింది.
రైలు కారుని ఢీకొన్న వేగం చాలా ఎక్కువగా ఉండటంతో కారు ముక్కలై ముక్కలైపోయింది. దాని శిథిలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ వీడియో చూస్తే ప్రమాదం ఎంత భయంకరంగా ఉందో ఊహించుకోవచ్చు. ఈ భయానక దృశ్యం సోషల్ మీడియాలో ప్రజలను కదిలించింది.
వీడియోను ఇక్కడ చూడండి
छोटी सी गलती कभी कभी बहुत भारी पड़ सकती है………
वीडियो अंत तक देखें और समझें कि आपको क्यों नियमों का पालन करना चाहिए…… pic.twitter.com/JcizXYLFJu
— Aarzoo (@Aarzoo3007) September 11, 2025
ఈ వైరల్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @Aarzoo3007 అనే ఐడి షేర్ చేసింది. ఒక చిన్న తప్పు కొన్నిసార్లు చాలా ఖరీదైనదిగా నిరూపించబడుతుంది. వీడియోను చివరి వరకు చూడండి . మీరు నియమాలను ఎందుకు పాటించాలో అర్థం చేసుకోండి’ అని క్యాప్షన్ ఈ వీడియోకు జత చేశారు.
వీడియో చూసిన తర్వాత ‘రైల్వే ట్రాక్ దాటే తొందరలో ప్రాణాలు కోల్పోయాడు’ అని ఒకరు, మరొకరు ‘ఈ వీడియో చూసిన తర్వాత ఎవరూ రైల్వే ట్రాక్ దాటడానికి ధైర్యం చేయరు’ అని రాశారు. అదే సమయంలో, చాలా మంది ఈ సంఘటనను నిర్లక్ష్యం ఫలితంగా అభివర్ణించారు ..ఇలా రిల్వే గేటు దాటే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




