- Telugu News Photo Gallery Spiritual photos Budh Gochar 2025 in kanya rashi : these zodiacs signs luck will shine will get financial gain
Budh Gochar 2025: కన్యారాశిలో బుధ సంచారం.. ఈ రాశులపై లక్ష్మి అనుగ్రహం.. ఏ పని మొదలు పెట్టినా డబ్బే డబ్బు..
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు, రాశులకు, నక్షత్రాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. నవ గ్రహాల్లో బుధుడిని రాకుమారుడు అని అంటారు. బుధుడు జ్ఞానానికి, తర్కానికి కారకుడు. బుధ సంచారము సెప్టెంబర్ నెలలో త్వరలో జరగబోతోంది. బుధ సంచారము కారణంగా మొత్తం రాశులపై ప్రభావం చూపించినా.. కొన్ని రాశులకు అధిక ప్రయోజనాలు కలిగిస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం..
Updated on: Sep 12, 2025 | 8:58 AM

వ్యాపారం, సాంకేతికత, తెలివితేటలు, కమ్యూనికేషన్, జ్ఞానం, చర్మాన్ని సూచించే గ్రహం బుధుడు. జాతకంలో బుధుడు బలంగా ఉంటే వ్యక్తికి మంచి తెలివితేటలు, స్పష్టమైన కమ్యూనికేషన్, ఆర్థిక స్థిరత్వం ఉంటాయి. బలహీనంగా ఉంటే, వ్యక్తికి గందరగోళం, మాటల్లో తడబాటు, ఆర్థిక అస్థిరత ఏర్పడవచ్చు. ఈ నేపధ్యంలో బుధుడు సెప్టెంబర్ 15న తన రాశిని మార్చుకోబోతున్నాడు. బుధుని రాశి మార్పు దాని నిర్ణీత సమయంలో జరుగుతుంది. సెప్టెంబర్ 15, 2025న ఉదయం 10:58 గంటలకు బుధుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుని సంచారము ప్రభావం.. కొన్ని రాశులతో పాటు, స్టాక్ మార్కెట్, దేశం, ప్రపంచంపై కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని రాశులవారికి పట్టిందల్లా బాగారంగా మారుతుంది.

వృషభ రాశి: వారికి బుధ సంచారము శుభప్రదం. ఈ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంది. అధికారులు తమ కెరీర్‌లో విజయం సాధిస్తారు. వృషభ రాశికి చెందిన వ్యాపారస్తులు కొత్త అవకాశాలు పొందనున్నారు. వీరు తమ సామర్ధ్యంపై నమ్మకం ఉంచాలి. అదృష్టం ఉంటుంది.

మిథున రాశి: వారికి ఈ సంచారము ఆనందాన్ని ఇస్తుంది. లాభాలను పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో మంచి డబ్బు సంపాదించగలుగుతారు. డబ్బు ఆదా చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పనులను ప్రారంభించే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి.

సింహ రాశి : ఈ రాశి వారికి బుధ సంచారము అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు ఎక్కువ డబ్బు సంపాదించడం.. డబ్బు ఆదా చేయడం వంటి వాటిపై దృష్టిని సారిస్తారు. తెలివిగా చేసే వ్యాపారం వల్ల ఆర్ధికంగా బలపడతారు. ఈ సమయంలో వీరు తాము పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందే అవకాశం ఉంది.

కన్య రాశి: బుధ సంచారము కన్య రాశి వారికి పనిలో వేగాన్ని తెస్తుంది. ఈ సమయంలో వీరు తమ లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేస్తారు. ఈ సమయంలో అధికంగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. తాము చేసే పనుల్లో విజయం సాధిస్తారు. కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారం చేసే వారికి ఇది చాలా శుభ సమయం.

వృశ్చిక రాశి. ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఈ సమయం శుభ సమయం. స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి మద్దతు లభిస్తుంది. పూర్వీకుల ఆస్తి నుంచి కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కెరీర్ లో గొప్ప విజయాన్ని పొందే అవకాశం ఉంది. చేస్తున్న పనిలో కొత్త అవకాశాలు లభించవచ్చు. విదేశీ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది.

మకర రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు చేసే ప్రయత్నాలలో విజయం సాధించే బలమైన అవకాశం ఉంది. అప్పు వాసులు అయ్యే ఆవకాశం ఉంది. అనేక ప్రయోజనాలను పొందవచ్చు. చేపట్టిన పనిలో సంతృప్తి చెందుతారు. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి.




