AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: పెళ్లి చేసుకునే యువతిలో చూడాల్సింది అందం, ఆస్తి కాదు.. ఈ లక్షణాలు.. లేదంటే మీ కొంప కొల్లేరే..

ఆచార్య చాణక్యుడు రాజకీయ, ఆర్ధిక విషయాలను మాత్రమే కాదు.. సమాజంలో మానవ జీవితానికి సంబందించిన అనేక విషయాలను తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. అందులో సరైన భార్యను ఎంచుకోవడానికి చాణక్యుడు కొన్ని నియమాలను చెప్పాడు. భార్య ఎంపికకు సంబంధించి ఆచార్య చాణక్యుడు ప్రత్యేక విధానాలను పేర్కొనాడు. జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఏ లక్షణాలను పరిగణించాలో తెలుసుకోండి..

Surya Kala
|

Updated on: Sep 12, 2025 | 8:30 AM

Share
 
రాజకీయాలు, దౌత్యం, నైతికతల విషయంలో ఆచార్య చాణక్యుడి చెప్పిన అనేక విషయాలు నేటికీ అనుసరణీయమే. చాణక్యుడు ప్రజా పాలన ఎలా చేయాలో మాత్రమే కాదు.. సంబంధాలను ఎలా కొనసాగించాలో కూడా చెప్పారు. చాణక్య నీతి ప్రకారం వివాహం అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయం. కనుక పెళ్లి విషయంలో చేసే ఒక్క పొరపాటు మొత్తం భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. అందుకే ఆచార్య చాణక్యుడు భార్య ఎంపిక గురించి కొన్ని స్పష్టమైన విషయాలు చెప్పాడు. ఆ లక్షణాలను విస్మరిస్తే ఆ యువతిని చేసుకున్న భర్త జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి వస్తుందట.

1 / 7
స్త్రీ అందమైన రూపాన్ని బట్టి జీవిత భాగస్వామిని ఎంచుకోవడం అతి పెద్ద తప్పని చాణక్యుడు చెప్పాడు. బాహ్య సౌందర్యం క్షణికమైనది.. ఆమెకు మంచి లక్షణాలు,  మంచి విలువలు లేకపోతే.. అందాన్ని చూసి పెళ్లి చేసుకున్న పురుషుడు జీవితాంతం ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక మానసిక సౌదర్యం పెళ్ళికి అత్యంత ముఖ్యం అని పేర్కొన్నాడు.

2 / 7
మంచి కుటుంబానికి చెందిన కూతురు.. చాణక్య నీతి ప్రకారం మంచి కుటుంబంలో పెరిగిన సంస్కారవంతురాలైన అమ్మాయినే ఎప్పుడూ వివాహం చేసుకోవాలి. అలాంటి కుటుంబాల్లో పెరిగే కుమార్తెలు ధర్మవంతులు . తమ జీవిత భాగస్వామిని.. అతని కుటుంబాన్ని ప్రేమిస్తారు. గౌరవిస్తారు. అందం ఆధారంగా మాత్రమే వివాహం చేసుకుంటే.. తరువాత విచారపడాల్సి రావచ్చు.

3 / 7
ఓర్పు తప్పనిసరి:  సహనం అనేది ఎలాంటి క్లిష్ట పరిస్థితిని అయినా ఎదుర్కోగల ఒక సద్గుణం. భార్య ఓపికగా ఉండటం చాలా ముఖ్యమని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. ఓపిక, సహనం ఉన్న భార్య తన భర్త లేదా.. కుటుంబం కష్ట సమయాలను ఎదుర్కొంటుంటే.. అండగా నిలుస్తుంది. అడుగడుగునా దైర్యాన్ని ఇస్తుంది.

4 / 7
ప్రశాంతమైన స్వభావం: కోపంగా ఉండే స్వభావం ఒక వ్యక్తి జీవితంలోని ఆనందాన్ని తగ్గిస్తుంది. చాణక్యుడి ప్రకారం కోపంగా ఉండే స్త్రీని వివాహం చేసుకోవడం జీవితాన్ని అశాంతితో నింపుతుంది. ప్రశాంతంగా ఉండే భార్య సంతోషకరమైన వైవాహిక జీవితానికి కీలకం.

5 / 7
విలువ కలిగిన స్త్రీ: భార్యకు మంచి విలువలు.. ఆధ్యాత్మిక జ్ఞానం ఉండటం ముఖ్యం. ఒక స్త్రీ సంస్కారవంతురాలైతే.. ఆ కుటుంబం మొత్తం సంస్కారంగా నడిచేలా చేస్తుంది. ఆమె మాత్రమే మొత్తం కుటుంబాన్ని సరైన దిశలో నడిపించగలదు. తన భర్తకు మంచిని తీసుకురాగలదని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు.

6 / 7
ఆచార్య చాణక్యుడి విధానాలు రాజకీయాలకే పరిమితం కాలేదు.. వైవాహిక జీవితాన్ని ఎలా సంతోషంగా ఉంచుకోవాలో కూడా దిశా నిర్దేశం చేస్తాయి. జీవిత భాగస్వామిని అందాన్ని చూసి మాత్రమే కాకుండా, ఓర్పు, సంస్కృతి, స్వభావం, లక్షణాలను అంచనా వేయడం ద్వారా ఎంచుకోవాలని చాణక్యుడు స్పష్టమైన అభిప్రాయం. ఈ లక్షణాలున్న యువతిని భార్యగా ఎంపిక చేసుకుంటే.. వివాహ జీవితం విజయవంతం అవుతుంది.  జీవితం సంతోషంగా సాగుతుంది.

7 / 7