- Telugu News Photo Gallery Spiritual photos Shardiya Navratri 2025: Best place to Light Lamps in Your Home and Puja Rituals to rid of omens
Navratri 2025: నవరాత్రుల్లో ఇంట్లో ఈ ప్రదేశాల్లో దీపాలు వెలిగించండి.. జీవితంలో చీకట్లు తొలగుతాయి.. ధనధాన్యానికి లోటు ఉండదు..
శారదీయ నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడానికి యావత్ భారత దేశం రెడీ అవుతుంది. దుర్గాదేవిని పూజించే సమయం ఆసన్నం అవుతోంది. ఈ నవరాత్రుల సమయంలో అమ్మవారిని పూజించి ఉపవాసం పాటిస్తారు. అంతేకాదు ఈ నవరాత్రి సమయంలో ఇంట్లోని ప్రముఖ ప్రదేశాలలో దీపాలు వెలిగించడం వల్ల జీవితంలోని చీకట్లు తొలగి.. శుభం కలుగుతుందని చెబుతున్నారు.
Updated on: Sep 12, 2025 | 11:11 AM

శారదీయ నవరాత్రి పండుగ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇది తొమ్మిది రోజుల పాటు కొనసాగే దుర్గాదేవికి అంకితం చేయబడిన పండగ. ఈ సమయంలో భక్తులు దుర్గాదేవిని పూజిస్తారు. అదే సమయంలో ఈ తొమ్మిది రోజులు దీపం వెలిగించడం చాలా ముఖ్యమైన, పవిత్రమైన ఆచారంగా పరిగణించబడుతుంది. ఇది ఒక వ్యక్తి జీవితంలోని చీకటిని తొలగిస్తుందని చెబుతారు. దీనితో పాటు జీవితంలోకి శుభం కలుగుతుందని విశ్వాసం. నవరాత్రులలో ఏ ప్రదేశాలలో దీపం వెలిగించాలంటే

ఇంట్లో పూజ గది - నవరాత్రిలో మొదటి దీపాన్ని ఇంటిలో పూజ గదిలో లేదా పూజ ప్రాంతంలో వెలిగించాలి. ఈ దీపం తొమ్మిది రోజుల పాటు నిరంతరం వెలుతూ ఉండాలి. దీనిని అఖండ జ్యోతి అని కూడా పిలుస్తారు. ఈ దీపం ఇంట్లో సానుకూల శక్తిని తెస్తుంది. అన్ని కష్టాలను తొలగిస్తుంది. మీరు అఖండ జ్యోతిని వెలిగించలేకపోతే.. ఉదయం , సాయంత్రం నెయ్యితో లేదా నూనెతో దీపాన్ని ఖచ్చితంగా వెలిగించండి.

ప్రధాన ద్వారం - ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం వలన ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారని నమ్ముతారు. ఈ దీపం ఇంటిలోని ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఇంట్లో ఆనందం , శాంతిని తెస్తుంది. కనుక ఇంటి ప్రధాన ద్వారం దగ్గర రెండు వైపులా దీపం వెలిగించవచ్చు.

తులసి మొక్క - తులసి మొక్క చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. నవరాత్రి తొమ్మిది రోజులలో సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీ దేవి ప్రసన్నురాలవుతుంది. ఇంట్లో సంపద, ధాన్యాలకు కొరత ఉండదు.

వంటగది - అన్నపూర్ణ దేవి వంట గదిలో నివసిస్తుందని నమ్మకం. కనుక నవరాత్రి సమయంలోఇంటి వంటగదిలో దీపం వెలిగించాలి. వంటగదిలో దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో ఎప్పుడూ ఆహార కొరత ఉండదు. ఈ దీపం కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది.

రావి చెట్టు - మీ ఇంటి దగ్గర రావి చెట్టు ఉంటే నవరాత్రి సమయంలో అక్కడ దీపం వెలిగించడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. త్రిముర్తులతో పాటు సకల దేవుళ్ళు రావి చెట్టులో నివసిస్తారని నమ్ముతారు. రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల పితృ దోషం కూడా తొలగిపోతుందని చెబుతారు.

దీపాలు వెలిగించటానికి నియమాలు దీపం వెలిగించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. నెయ్యి దీపాన్ని ఎల్లప్పుడూ దేవత విగ్రహానికి కుడి వైపున, నూనె దీపాన్ని ఎడమ వైపున ఉంచాలి. దీపం వెలిగించడానికి స్వచ్ఛమైన నెయ్యి లేదా నువ్వుల నూనెను మాత్రమే ఉపయోగించండి. దీపం వెలిగించేటప్పుడు 'ఓం దుం దుర్గాయే నమః' అనే మంత్రాన్ని జపించండి.




