- Telugu News Photo Gallery These are the five plants that should not be kept in front of the house according to Vastu
వాస్తు టిప్స్ : మీ ఇంటి ముందు ఈ మొక్కలు ఉంటే వెంటనే తొలిగించండి!
చాలా మంది తమ ఇంటిని అందంగా మార్చుకోవడానికి ఇంటి ముందు రకరకాల మొక్కలు నాటుతుంటారు. కానీ కొన్ని మొక్కలు ఇంటికి అందమే కాకుండా, పాజిటివ్ ఎనర్జీ తీసుకరాగా, కొన్ని మొక్కలు మాత్రం అనేక సమస్యలను తీసుకొస్తాయంట. కాగా అసలు ఇంటి ముందు వాస్తు ప్రకారం ఎలాంటి మొక్కలు ఉండకూడదో ఇప్పుడు మనం చూద్దాం.
Updated on: Sep 12, 2025 | 12:33 PM

ఇంటి ప్రధాన ద్వారం అనేది ఇంటి శ్రేయస్సు మొత్తాన్ని కాపాడుతుంది. ఇది ప్రతి కూల శక్తి, సానుకూల శక్తి రెండింటికీ ద్వారం అంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు మీరు కొన్ని మొక్కలు నాటితే అతి ఇంటిలో అనేక సమస్యలకు కారణం అవుతుందంట. అందులో ముఖ్యమైనది రావి చెట్టు. ఇంటి ముందర రావి చెట్టు అస్సలే ఉండకూడదని చెబుతున్నారు పండితులు. దీని వలన ఇంటి పురోగతి అస్సలే ఉండదంట.

అదే విధంగా ఇంటికి ఎదురుగా ఎప్పుడూ ముళ్ల మొక్కలు పెంచుకోకూడదంట. చాలా మంది ఇంటి ముందు అందంగా ఉంటుందని రకరకాల ముళ్ల మొక్కలను ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెడుతుంటారు. కానీ ఇంటి ముందు ముళ్ల మొక్కలు ఉండటం వలన ఇంటిలో నెగటివ్ ఎనర్జీ పెరగడమే కాకుండా, ఇంట్లో కలహాలు ఎక్కువ అవుతాయంట.

అదే విధంగా ఆకర్షణీయంగా ఉండే కొన్ని మొక్కలు ఇంటి ప్రధాన ద్వారం వద్ద అందంగా ఉన్నప్పటికీ, ఇవి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలోనికి చాలా నెగిటివ్ శక్తిని తీసుకొస్తాయంట.అందులో ఒకటి బోన్సాయ్ మొక్క. ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కానీ ఇది ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండటం వలన ఉద్యోగంలో సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎదురు అవుతాయంట..

అలాగే ఎండిపోయిన తులసి మొక్క లేదా ఎండిపోయినా ఏ ఇతర మొక్కలు ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండకూడదంట. ఇవి ఇంటిలోపలికి నెగటివ్ ఎనర్జీ తీసుకొస్తాయంట. అలాగే చింత పండు మొక్క కూడా ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉండటం మంచిది కాదు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

కొంత మంది పత్తి చెట్టును ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా మెడుతుంటారు. కానీ దీనిని ఇంటికి ఎదురుగా పెంచుకోవడం అస్సలే శుభ ప్రదం కాదంట. దీని వలన మరణం లేదా అనవసరమైన ఖర్చులు పెరుగుతాయని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అదే విధంగా, పండ్ల చెట్ల, జిల్లేడు చెట్టు కూడా ఇంటికి ఎదురుగా అస్సలే ఉండకూడదంట. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.



