- Telugu News Photo Gallery The conjunction of Mercury and Sun will fulfill the wishes of these zodiac signs
బుధ, సూర్య గ్రహాల కలయిక.. వీరు కోరిన కోర్కెలు నెరవేరడం ఖాయం!
సింహ రాశిలోకి బుధ గ్రహం, సూర్యగ్రహం సంచారం, కలియిక వలన నాలుగు రాశుల వారికి కోరిన కోర్కెలు నెరవేరనున్నాయంట. కాగా, ఏ రాశుల వారికి అదృష్టం కలుగుతుంది? బుధ, సూర్య గ్రహాల సంచారం, కలయి ఏ రోజు జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Sep 12, 2025 | 12:33 PM

సెప్టెంబర్ 13 శని వారం రోజున శక్తివంతమైన గ్రహాలు సూర్య గ్రహం, బుధ గ్రహం సంచారం చేయబోతున్నాయి. ఈ రెండు గ్రహాలు ఒకే సారి నక్షత్ర సంచారం చేయడమే కాకుండా, సిహరాశిలో కలిసి ఉంటాయి. దీంతో ఇది 12 రాశుల వారిపై వారి ప్రభావం చూపగా, నాలుగు రాశుల వారికి మాత్రం లక్కు కలిసి వస్తుంది.

తుల రాశి : తుల రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వీరు ఏ పని చేసినా అందులో విజయం చేకూరుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఎవరైతే చాలా రోజుల నుంచి తీర్థయాత్రలు చేయాలని భావిస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. చాలా ఆనందంగా జీవిస్తారు.

మేష రాశి : మేష రాశి వారికి సూర్య గ్రహం, బుధ గ్రహం కలయిక వలన పట్టిందల్లా బంగారమే కానుంది. వీరికి అనుకున్న పనులన్నీ సకాలంలో నెరవేరుతాయి. విద్యార్థులకు, వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లాభిస్తాయి.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి అద్భుత ప్రయోజనాలు చేకూరుతాయి. సూర్య గ్రహం, బుధ గ్రహం సంచారం వలన వీరికి పట్టిందల్లా బంగారమే కానుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. సమయానికి డబ్బులు చేతికందుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

సింహ రాశి : ఈ రాశి వారికి రెండు గ్రహాల కలయిక వలన అద్భుతంగా ఉంటుంది. ఖర్చులు పెరిగా ఆదాం ఎక్కువ రావడంతో ఆనందంగా ఉంటారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సకాలంలో డబ్బులు చేతికందుతాయి. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు.



