Watch Video: చటుక్కున వచ్చాడు.. లటుక్కున ఎత్తుకుపోయాడు..! అనకాపల్లిలోన మేక దొంగ హల్‌చల్.. వీడియో
అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి.. మేకను అపహరించుకొని క్షణాల్లో వెళ్లిపోయాడు. దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
Anakapalle district goat stealing: దొంగలు రెచ్చిపోతున్నారు.. అక్కడ, ఇక్కడ అని కాదు.. అన్ని చోట్ల చేతివాటం చూపిస్తున్నారు. చివరకు కోళ్లను, మేకలను కూడా వదలడం లేదు.. తాజాగా అనకాపల్లి జిల్లాలో మేక దొంగతనం జరిగింది. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి.. మేకను అపహరించుకొని క్షణాల్లో వెళ్లిపోయాడు. దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అనకాపల్లి జిల్లాలోని చోడవరంలో (chodavaram) అర్ధరాత్రి ఓ దొంగ ఇంట్లో చొరబడ్డాడు. గేటు విప్పుకుని లోపలకు వెళ్లి అక్కడ కట్టి ఉన్న మేక పిల్లను ఎత్తుకు పోయాడు.
ఈ ఘటన జిల్లాలోని చోడవరం మండలం దుడ్డిపాలేం జంక్షన్లోని ఇంట్లో జరిగింది. ముఖానికి కర్చీఫ్ కట్టుకుని వచ్చిన దొంగ.. లోపలకు చొరబడ్డాడు. అనంతరం మేక పిల్లను ఎత్తుకుని వచ్చి.. గేటు నెట్టుకోని మరి గుట్టు చప్పుడు కాకుండా ఎత్తుకుపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మేక పిల్ల దొంగతనంపై యజమాని ఆడారి లక్ష్మీ పోలీసులను ఆశ్రయించారు. కాగా.. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..