Viral News: వామ్మో.. ఇదే ఆచారం రా.. బాబూ..! కొత్త జంటకు మూడు రోజులపాటు ‘నో టాయిలెట్’.. ఈ ఛాలెంజ్‌లో పాస్ అయితేనే
ఇండోనేషియాలోని టిడాంగ్ కమ్యూనిటీకి చెందిన వారు.. వివాహం తర్వాత మూడు రోజుల పాటు వాష్‌రూమ్‌ను ఉపయోగించకుండా కొత్త జంటకు నిషేధం విధిస్తారు..
Wedding Viral News: ప్రపంచవ్యాప్తంగా కొన్ని విచిత్రమైన ఆచారాలు ఉన్నాయి. కానీ ఈ ఆచారం గురించి వింటే మాత్రం.. మీరే ఆశ్చర్యపోతారు. సాధారణంగా.. వివాహం జరిగిన సమయంలో ఏవేవో ఆచారాలు చూస్తుంటాం.. అయితే.. ఇండోనేషియాలోని ఓ తెగ వారు పెళ్లి తర్వాత మూడు రోజుల పాటు మరుగుదొడ్డిని ఉపయోగించకూడదని కొత్త జంటకు నిషేదాజ్ఞలు విధించారు.. ఇదేంటీరా..? నాయనా ఇలా ఉన్నారు ఆశ్చర్యపోతున్నారా..? అయితే.. మీరు చదివింది నిజమే!. ఆ వివరాలేంటో చూద్దాం.. ఇండోనేషియాలోని టిడాంగ్ కమ్యూనిటీకి చెందిన వారు.. వివాహం తర్వాత మూడు రోజుల పాటు వాష్‌రూమ్‌ను ఉపయోగించకుండా కొత్త జంటకు నిషేధం విధిస్తారు.. ఈ నియమాన్ని ఉల్లంఘించడం జంటకు దురదృష్టం వెంటాడుతుందని ఈ తెగకు చెందిన ప్రజలు విశ్వసిస్తారు. వైవాహిక జీవితంలో పొరపచ్చాలు, విడిపోవడం, జంటలో విశ్వాసం తగ్గడం, చిన్న వయస్సులోనే వారి పిల్లలు మరణిస్తారని ఇలా ఏవేవో నమ్ముతారు.
అయితే.. తాజాగా ఓ జంటకు కూడా అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఫొటోలో ఉన్న జంటను చూస్తున్నారు కదా.. వీరికి కూడా వివాహమైంది. అయితే.. వారిని ఇంటి లోపలకు పంపిన టిడాంగ్ తెగకు చెందిన కుటుంబసభ్యులు తక్కువ మొత్తంలో ఆహారం, పానీయాలను మాత్రమే అనుమతించారు. మూడు రోజుల తర్వాత వారు స్నానం చేసి ఆపై మరుగుదొడ్డిని ఉపయోగించడానికి అనుమతి ఉంటుంది.
టిడాంగ్ ప్రజలు ఇండోనేషియా, మలేషియా మధ్య సరిహద్దుకు సమీపంలో ఉన్న బోర్నియో అనే ఈశాన్య ప్రాంత నివాసులు. ఈ తెగలో పెళ్లి వేడుకలు జరిగినప్పుడల్లా ప్రతీ.. జంట ఈ విచిత్రమైన పద్ధతిని అనుసరించాలి. అన్ని ఊరేగింపులు పూర్తయిన తర్వాత జంటను ఒక గదికి తీసుకువెళతారు. అక్కడ వారు వివాహం చేసుకున్న తర్వాత మొదటి మూడు రోజులు గడపవలసి ఉంటుంది. అక్కడ వారికి మరుగుదొడ్డి సౌకర్యం ఉండకుండా.. ముందే జాగ్రత్తలు తీసుకుంటారు.
ఒకవేళ ఆ ప్రాంతంలో మరుగుదొడ్డి ఉంటే.. వారిని నిత్యం బంధువులు పర్యవేక్షిస్తుంటారు. అయితే.. మోసం చేయకుండా ఛాలెంజ్ పూర్తిచేసేలా జంటలు ప్రయత్నిస్తుంటాయి. ఈ ఛాలెంజ్‌లో ఉత్తీర్ణులైన జంటలు మాత్రమే శాశ్వతమైన/దీర్ఘకాలిక వైవాహిక జీవితాన్ని కలిగి ఉంటారని.. విఫలమైన వారి వివాహంలో దురదృష్టం కలుగుతుందని ఈ తెగ ప్రజలు నమ్ముతారు.
అయితే.. వారు కచ్చితంగా పాటిస్తారా..? లేదా అనేది తెలియదు.. కానీ దీనికి సంబంధించిన కథనాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ షరతులు ఉంటాయా..? లేదా..? అనేది కచ్చితంగా తెలియదు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..