PM Narendra Modi: భారత రాజకీయాల్లో ప్రభంజనం.. నరేంద్ర మోడీ సర్కార్‌కు నేటితో 8 ఏళ్లు.. దేశవ్యాప్తంగా వేడుకలు..
ఎనిమిదేళ్ల కాలంలో ప్రధాని మోడీ.. దేశ సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం, అన్ని వర్గాల భద్రత, సంక్షేమానికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘సబ్ కా సాత్- సబ్ కా వికాస్, -సబ్ కా విశ్వాస్’ అనే నినాదంతో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకెళ్లేలా పలు సంస్కరణలు చేపట్టారు.
Narendra Modi Government Eight Flagship Schemes: బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ప్రభుత్వం అధికారం చేపట్టి నేటితో (మే 26తో) ఎనిమిదేళ్లు పూర్తయింది. 2014 మే 26న నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి దేశంలో ఎన్నో సంస్కరణలకు, మరెన్నో ఆవిష్కరణలకు నాంది పలుకుతూ.. ఇటు దేశంలో.. అటు ప్రపంచ రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ప్రధాని మోడీ.. దేశ సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం, అన్ని వర్గాల భద్రత, సంక్షేమానికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘సబ్ కా సాత్- సబ్ కా వికాస్, -సబ్ కా విశ్వాస్’ అనే నినాదంతో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకెళ్లేలా పలు సంస్కరణలు చేపట్టారు. రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలను సమానదృష్టితో చూస్తూ.. ఎప్పటికప్పుడు అన్ని రంగాల్లో తీసుకోవాల్సిన చర్యలు.. అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తున్నారు. రాజకీయాల కంటే దేశమే ముఖ్యమని భావించి ఎన్నో ఏండ్లుగా నానుతున్న సమస్యల పరిష్కారానికి చోరవ చూపుతున్న ప్రధాని మోడీ.. తన పాలనతో ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. సుపరిపాలన అందిస్తూ సాహసోపేత నిర్ణయాలతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. దీంతోపాటు దేశానికి అవసరం లేని చట్టాలను సైతం రద్దు చేసి ప్రధాని అందరి మనసుల్లో చిరకాలం గుర్తిండిపోయేలా నిలిచారు. అటు ప్రపంచ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని.. కరోనా కష్టకాలంలో సహాసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో పాటు సరిహద్దుల్లో కాలు దువ్వుతున్న పాకిస్తాన్, చైనా లాంటి దేశాలకు సైతం గట్టి వార్నింగ్ ఇచ్చేలా నిర్ణయాలు తీసుకుని.. ప్రపంచం నివ్వెరపోయేలా చేశారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తయిన నేపథ్యంలో బీజేపీ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించింది. బీజేపీ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి మే 31 వరకు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
కాగా.. జైపూర్ లో గతవారం జరిగిన బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఈ నెలతో NDA ప్రభుత్వం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ ఎనిమిదేళ్లు అనేక తీర్మానాలు, విజయాలు సాధించాం.. ఈ ఎనిమిదేళ్లు సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేశాం’’ అని పేర్కొన్నారు. 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వ పాలనపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగిందంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పేద, అర్హులైన లబ్ధిదారులకు అవగాహన కల్పించాలి.. దీనికోసం అన్ని చోట్ల ప్రచారం ప్రారంభించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. తీసుకొచ్చిన సంస్కరణలు, చేపట్టిన అభివృద్ధితో ప్రపంచం మొత్తం నేడు భారత్ వైపు చూస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 75వ స్వాతంత్య్ర సంవత్సరంలో.. దేశం రాబోయే 25 ఏళ్ల లక్ష్యాలను నిర్దేశిస్తోందని మోడీ పేర్కొన్నారు. రాబోయే 25 ఏళ్ల లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి కోసం నిరంతరం శ్రమించాల్సిన సమయం బీజేపీకి ఉందని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..