Navjot Singh Sidhu: నవజ్యోత్ సింగ్ సిద్ధూకు జైలులో కొత్త ఉద్యోగం.. పని, జీతం ఎంతో తెలుసా..?

ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్టుల్లో సిద్ధూ మున్షీగా పని చేస్తున్నారని జైలు అధికారులు తెలిపారు.

Navjot Singh Sidhu: నవజ్యోత్ సింగ్ సిద్ధూకు జైలులో కొత్త ఉద్యోగం.. పని, జీతం ఎంతో తెలుసా..?
Navjot Singh Sidhu
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 26, 2022 | 11:06 AM

Navjot Singh Sidhu as Munshi: మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాటియా సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. 34 ఏళ్ల నాటి రోడ్ రేజ్ కేసులో (1988) సుప్రీం కోర్టు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించిన నేపథ్యంలో సిద్ధూ స్థానిక కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత మే 20 నుంచి పాటియాలా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే.. పాటియాలా జైలులో పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ‘మున్షీ’గా పని చేయనున్నారు. పాటియాలా సెంట్రల్ జైలులో క్లరికల్ వర్క్‌కు అసిస్టెంట్‌ (క్లర్కు) గా పని చేసేందుకు.. అధికారులు సిద్ధూని నియమించినట్లు సమాచారం. సిద్ధూ మంగళవారం నుంచి ఈ పని ప్రారంభించారని తెలుస్తోంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్టుల్లో సిద్ధూ మున్షీగా పని చేస్తున్నారని జైలు అధికారులు తెలిపారు. రెండు వర్కింగ్ షిఫ్టుల మధ్య సిద్ధూకి మూడు గంటల విరామం లభించనుంది.

పాటియాలా జైలు నిబంధనల ప్రకారం.. సిద్ధూకు మొదటి మూడు నెలలు జీతం లేకుండా శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత సెమీ-స్కిల్డ్ లేదా నైపుణ్యం కలిగిన ఖైదీగా.. సిద్ధూ పనిని నిర్వహణను బట్టి రూ.30 నుంచి రూ.90 మధ్య సంపాదించనున్నారు. పనిని బట్టి చూస్తే సిద్ధూ మూడు నెలల శిక్షణ పూర్తయిన తర్వాత రోజుకు రూ.40 సంపాదించనున్నట్లు సమాచారం. ఈ వేతనం మొత్తం అతని ఖాతాలో జమ అవుతుంది.

కాగా.. సోమవారం సిద్ధూను వైద్య బృందం పరిశీలించిన తర్వాత.. ఆరోగ్య పరిస్థితుల కారణంగా సిద్ధూ ప్రత్యేక ఆహారం కూడా తీసుకుంటున్నారు. అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జైలులో సాధారణ ఆహారం కాకుండా ప్రత్యేక ఆహారం తీసుకోవాలని సిద్ధూ గతంలో అభ్యర్థించారు. ఆయన అభ్యర్థన మేరకు.. భారీ భద్రతతో పాటియాలాలోని రాజింద్ర ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో సిద్ధూ అనేక వైద్య పరీక్షలు చేయించుకున్నారని ఆయన న్యాయవాది హెచ్‌పిఎస్ వర్మ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?