AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టేకాఫ్ అవుతుండగానే కుప్పకూలిన హెలికాప్టర్.. షాకింగ్ వీడియో వైరల్!

కొన్నిసార్లు, ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద విషాదానికి దారితీయవచ్చు, అది రోడ్డు ప్రమాదం అయినా, హెలికాప్టర్ లేదా విమాన ప్రమాదం అయినా..! మీరు గాల్లో ఎగురుతున్న హెలికాప్టర్లను చూసి ఉండవచ్చు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో భయభ్రాంతులకు గురిచేసింది.

టేకాఫ్ అవుతుండగానే కుప్పకూలిన హెలికాప్టర్.. షాకింగ్ వీడియో వైరల్!
Helicopter Crashed
Balaraju Goud
|

Updated on: Sep 28, 2025 | 12:17 PM

Share

కొన్నిసార్లు, ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద విషాదానికి దారితీయవచ్చు, అది రోడ్డు ప్రమాదం అయినా, హెలికాప్టర్ లేదా విమాన ప్రమాదం అయినా..! మీరు గాల్లో ఎగురుతున్న హెలికాప్టర్లను చూసి ఉండవచ్చు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో భయభ్రాంతులకు గురిచేసింది. రెప్పపాటులో పెను ప్రమాదం తప్పింది. ఈ వీడియోలో, ఒక హెలికాప్టర్ టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ప్రమాదం చాలా భయంకరమైనది. అది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో, హెలికాప్టర్ టేకాఫ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఫైలట్ ఇంజన్ స్టార్ చేసి పైకి లేచేందుకు ప్రయత్నించారు. అది అకస్మాత్తుగా గాలిలోనే ఊగిపోతూ కనిపించింది. పైలట్ హెలికాప్టర్‌ను నియంత్రించడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ విఫలమయ్యారు. చివరికి నేలపైనే క్రాష్ అయ్యింది హెలికాప్టర్. ఒక వ్యక్తి పైలట్‌కు కొన్ని సూచనలు ఇస్తున్నట్లు కనిపించింది. బహుశా అతన్ని ఎగరవద్దని సలహా ఇస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ కొన్ని సెకన్లలో, పైలట్ హెలికాప్టర్‌పై నియంత్రణ కోల్పోయి కూలిపోయాడు. అయితే ఈ ఘటనలో పైలట్ ప్రమాదం నుండి బయటపడ్డాడని చెబుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే, జనం భయభ్రాంతులకు గురయ్యారు.

ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @expensive_fails అనే యూజర్‌నేమ్‌తో షేర్ చేశారు. ఈ 19 సెకన్ల వీడియోను 268,000 కంటే ఎక్కువ సార్లు వీక్షించారు. వందలాది మంది దీన్ని లైక్ చేసి, రకరకాల కామెంట్లు చేశారు.

వీడియో చూసిన తర్వాత, ఒక వినియోగదారు ఇలా వ్రాశాడు, “ఈ ప్రమాదం సెకన్లలో జరిగింది, నమ్మడం కష్టం.” మరొకరు ఇలా వ్రాశాడు, “హెలికాప్టర్లు ప్రమాదకరమైనవి.” పైలట్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చాలామంది చెప్పగా, మరికొందరు సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.

వీడియోను ఇక్కడ చూడండిః

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..