AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ చిన్న లెక్క కూడా తెలియకుండా గవర్నమెంట్ టీచర్ ఎలా అయ్యావు సారూ.. మళ్లీ 80 వేలు జీతం..!

ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాల నుండి వచ్చిన వైరల్ వీడియో ప్రభుత్వ పాఠశాలల్లో విద్య నాణ్యత, ప్రమాణాలు, ఉపాధ్యాయు అర్హతపై ఆందోళనలను వ్యక్తం చేస్తుంది. ఈ ఫుటేజ్‌లో కాంట్రాక్ట్త ఉపాధ్యాయురాలుగా పని చేస్తన్న వ్యక్తి, కనీసం ప్రాథమిక గణిత సమస్యను పరిష్కరించడానికి అష్టకష్టాలు పడ్డాడు

ఈ చిన్న లెక్క కూడా తెలియకుండా గవర్నమెంట్ టీచర్ ఎలా అయ్యావు సారూ.. మళ్లీ 80 వేలు జీతం..!
80i Salary, Zero Basics Teacher
Balaraju Goud
|

Updated on: Sep 28, 2025 | 11:50 AM

Share

బీహార్ రాష్ట్రంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాల నుండి వచ్చిన వైరల్ వీడియో ప్రభుత్వ పాఠశాలల్లో విద్య నాణ్యత, ప్రమాణాలు, ఉపాధ్యాయు అర్హతపై ఆందోళనలను వ్యక్తం చేస్తుంది. ఈ ఫుటేజ్‌లో కాంట్రాక్ట్త ఉపాధ్యాయురాలుగా పని చేస్తన్న వ్యక్తి, కనీసం ప్రాథమిక గణిత సమస్యను పరిష్కరించడానికి అష్టకష్టాలు పడ్డాడు. దీంతో నెలకు ₹70,000-₹80,000 మధ్య జీతాలు పొందుతున్న విద్యావేత్తల సామర్థ్యంపై సందేహాలను లేవనెత్తుతుంది.

ఈ వీడియోలో ఒక మహిళా ఉపాధ్యాయురాలిని స్కూల్‌లో ఎంచేస్తారని అడగడంతో ప్రారంభమవుతుంది. దానికి తాను శిక్షన్ సేవక్ అని, కాంట్రాక్ట్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్లు సమాధానం ఇచ్చారు. తరువాత అతను ఆమెకు ఒక సాధారణ గణిత ప్రశ్నను సంధించాడు. దాన్ని పరిష్కరించడానికి బదులుగా, తటపటాయిస్తూ తప్పులు చేస్తున్నారు. వీడియోను రికార్డ్ చేసిన వ్యక్తి దిద్దుబాట్లు చేసినప్పటికీ, ఉపాధ్యాయుడు పదేపదే అదే తప్పులు చేసింది. ఈ ఘటనతో నెలకు ₹70,000–80,000 సంపాదిస్తున్న టీచర్‌కు, ప్రాథమిక గణిత సమస్యలను పరిష్కరించలేకపోయారని అర్థమవుతోంది. ఇది ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఆందోళనకరమైన అంతరాలను బయటపెట్టింది. జీతాలు తగినంతగా ఉన్నప్పటికీ, సామర్థ్యం, శిక్షణ ప్రశ్నార్థకంగా మారాయి. ప్రాథమిక జ్ఞానం కూడా సరిగ్గా అందించకపోతే, అభివృద్ధి చెందిన, నైపుణ్యం కలిగిన భారతదేశం ఎలా సాధ్యమవుతుందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

indian.now అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో  ఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రభుత్వ బోధనా ఉద్యోగాలను పొందడానికి అవసరమైన అర్హతలు, ప్రాథమిక నైపుణ్యాల మధ్య అంతరాన్ని తెలియజేస్తుంది. ఈ పోస్ట్ ఆన్‌లైన్‌లో తీవ్ర స్పందనలకు దారితీసింది. “అర్హులైన అభ్యర్థులు ప్రైవేట్ ఉద్యోగాలలో ఒత్తిడికి గురవుతున్నారు. అయితే ఇలాంటి వ్యక్తులు ప్రాథమిక జ్ఞానం లేకుండానే భారీ జీతాలు సంపాదిస్తున్నారు.” ఒక వినియోగదారు వ్రాశాడు: “హాజరు లేదా సరైన పరీక్షలు లేకుండా డబ్బులకు బి.ఎడ్, ఎంఏ డిగ్రీలను అందిస్తున్న సంస్థలు ఉన్నాయి.” అంటూ మరొకరు పేర్కొన్నారు.

వీడియో చూడండి.. 

ఇదిలావుంటే, ఉపాధ్యాయ సంబంధిత సంఘటనల ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో భోపాల్‌లో మహాత్మా గాంధీ హయ్యర్ సెకండరీ స్కూల్‌లోని ఒక ఉపాధ్యాయురాలు తరగతి సమయంలో తన పాదాలను మసాజ్ చేయించుకున్న వీడియో బయటపడింది. అలాగే బీహార్‌లోని మరో షాకింగ్ కేసులో, ఒక ఉపాధ్యాయురాలు పాఠశాలలో తాగి వచ్చి సెలవు ప్రకటించింది. ఈ ఎపిసోడ్‌లు విద్యా వ్యవస్థలో పాతుకుపోయిన సమస్యలను సిగ్గుపడేలా చేస్తున్నాయి. నియామక పద్ధతులు, ఉపాధ్యాయ శిక్షణ, ప్రభుత్వ పాఠశాలల్లో పర్యవేక్షణ గురించి ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..