Viral Video: ఇలాంటి వంతెనను ఎప్పుడైనా చూశారా.. నది దాటాలంటే సాహసం చేయాల్సిందే..వీడియో చూస్తే వణకాల్సిందే

అవతలి వైపు వెళ్ళడానికి కాంక్రీట్ వంతెన లేదు. అటువంటి పరిస్థితిలో, వారు జుగాడ్ వంతెనను ఆశ్రయించారు.  మహిళలు మొదట చెట్టుపైకి ఎక్కి, ఆ తర్వాత మెల్లగా ముందుకు సాగి,

Viral Video: ఇలాంటి వంతెనను ఎప్పుడైనా చూశారా.. నది దాటాలంటే సాహసం చేయాల్సిందే..వీడియో చూస్తే వణకాల్సిందే
Viral Video
Follow us

|

Updated on: Mar 22, 2023 | 1:44 PM

కొన్నిసార్లు ఇలాంటి అద్భుతమైన ఇంజినీరింగ్ నమూనాలు చూసి ఎవరైనా ఆశ్చర్య పడాల్సిందే.. మనదేశంలో బ్రిటీష్ హయాంలో నిర్మించిన అనేక వంతెనలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అయితే కాలక్రమంలో కొన్ని వంతెనలు ప్రమాదకరంగా మారడంతో కూల్చివేయబడ్డాయి. కొన్ని బ్రిడ్జిలు వందల ఏళ్లుగా నిలిచి ప్రజలకు రవాణా సాధనంగా ఉపయోగపడుతుండడం ఇంజినీరింగ్ అద్భుత సృష్టి అనిపించక మానదు ఎవరికైనా. ఇప్పటికీ చాలా చోట్ల కాంక్రీట్ వంతెనలు లేక అనేకమంది ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కొండకోనల్లో నివసించే ప్రజలు తమ సమీప గ్రామాలకు వెళ్లాలంటే.. నదులు దాటాల్సి వస్తే.. ప్రాణాలను సైతం పణంగా పెట్టి దాటాల్సిందే.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఈ వీడియో చూస్తే ఇంతకీ సాహస ప్రయాణం చేయాలా అనిపించక మానదు ఎవరికైనా..

వైరల్ అవుతున్న వీడియోలో ఓ నది ప్రవహిస్తోంది. ఆ నదిని దాటడానికి కొందరు స్త్రీలు చెట్టుపైకి ఎక్కి వంతెన దాటడం కనిపిస్తుంది. అవతలి వైపు వెళ్ళడానికి కాంక్రీట్ వంతెన లేదు. అటువంటి పరిస్థితిలో, వారు జుగాడ్ వంతెనను ఆశ్రయించారు.  మహిళలు మొదట చెట్టుపైకి ఎక్కి, ఆ తర్వాత మెల్లగా ముందుకు సాగి, చెక్క వంతెనను మీద నుంచి నదిని దాటేందుకు ప్రయత్నిస్తున్న తీరును వీడియోలో చూడవచ్చు. పడిపోతే ఆమెకు ప్రమాదమని ఆమెకు తెలిసి ఉండవచ్చు.. అక్కడ మహిళ నదిని దాటడానికి రోజువారీ కార్యక్రమం  కావచ్చు, అందుకే ఆమె భయం లేకుండా హాయిగా అవతలి వైపుకు వెళ్ళింది. అయితే ఈ వంతెన ఎక్కే ముందు ఎవరైనా తెలియని వ్యక్తి ఆ మహిళలలను చూస్తే.. భయపడాల్సిందే..

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @HasnaZarooriHai అనే IDతో భాగస్వామ్యం చేయబడింది. మీకు ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి బ్రిడ్జి చూసారా అనే శీర్షిక ఉంది. రెండు నిమిషాల 18 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 18 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది వీడియోను లైక్ చేసి రకరకాల ఫన్నీ రియాక్షన్‌లు కూడా ఇచ్చారు.

ఇలా భారతదేశంలో మాత్రమే జరుగుతుంది’ అని ఒకరు కామెంటే చేస్తే.. ‘దేవుని లీల కూడా ప్రత్యేకమైనది. అక్కడి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి’ మరొకరు.. నవ భారతదేశంలో వంతెన ఇక్కడ కూడా కావాలి’ అని ఇంకొందరు కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..