AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంత్రి కుమార్తె పెళ్లి ఖర్చు చూస్తే కళ్లు తేలేస్తారు..  చీర రూ.17 కోట్లు, నగలు రూ.90 కోట్లు, మేకప్‌ ఏకంగా రూ.30 లక్షలు..

వివాహం జీవితంలో ఒక్కసారే వచ్చే మ‌ధుర ఘ‌ట్టం. అందుకే గుర్తుండిపోయేలా అట్టహాసంగా పెళ్లి తంతు జ‌రుపుకోవాలని ప్రతి ఒక్కరూ కలలుకంటారు. పేదవాడు తన స్తోమతకు తగ్గట్టు కాబోయే సతి మెడలో చిన్న పసుపు కొమ్మును తాళిగా కట్టి మురిసిపోతాడు. ధనవంతులు మాత్రం..

మంత్రి కుమార్తె పెళ్లి ఖర్చు చూస్తే కళ్లు తేలేస్తారు..  చీర రూ.17 కోట్లు, నగలు రూ.90 కోట్లు, మేకప్‌ ఏకంగా రూ.30 లక్షలు..
Minister Janardhana Reddy Daughter Marriage
Srilakshmi C
| Edited By: |

Updated on: Mar 22, 2023 | 7:24 PM

Share

వివాహం జీవితంలో ఒక్కసారే వచ్చే మ‌ధుర ఘ‌ట్టం. అందుకే గుర్తుండిపోయేలా అట్టహాసంగా పెళ్లి తంతు జ‌రుపుకోవాలని ప్రతి ఒక్కరూ కలలుకంటారు. పేదవాడు తన స్తోమతకు తగ్గట్టు కాబోయే సతి మెడలో చిన్న పసుపు కొమ్మును తాళిగా కట్టి మురిసిపోతాడు. ధనవంతులు మాత్రం నలుదిక్కులా మారుమ్రోగిపోయేలా.. అందరూ చర్చించుకునేలా అట్టహాసంగా జరుపుకుంటారు. ఈ మధ్యకాలంలో చాలామంది ఇలా పోటీలుపడిమరీ పెళ్లిళ్లకు ఖర్చులు పెడుతున్నారు. పిండి కొద్ది రొట్టే..అన్నరీతిలో. ఐతే కర్ణాటకు చెందిన ఓ మంత్రి తన కూతురు పెళ్లి చీర, మేకప్‌, నగలకే ఏకంగా రూ.500ల కోట్లు ఖర్చుపెట్టాడు. వినడానికి తేడాగా ఉన్నా వాస్తవం మాత్రం ఇదే. దీంతో దేశంలో అత్యంత ఖరీదైన పెళ్లివేడుకల్లో మంత్రిగారి కూతురు వివాహ వేడుకకూడా చోటు దక్కించుకుంది.

కర్ణాటక మాజీ మంత్రి జనార్ధన రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహం నవంబర్ 6, 2016న జరిగింది. 50 వేల మందికి పైగా అతిథులు ఆహాజరైన ఈ ఐదు రోజుల పెళ్లి వేడుకను అంగరంగ వైభవంగా జరిపించారు. అతిథులకు పంపిన వివాహ ఆహ్వాన పత్రికల్లో ఎల్‌సిడి స్క్రీన్‌లు అమర్చిమరీ ఇచ్చాడు. పెళ్లిపత్రికగా ఇచ్చిన బాక్స్‌లో ఎల్‌సిడి స్క్రీన్ ఉంటుంది. టేప్ విప్పగానే పాట ప్లే అవుతుంది. రెడ్డి కుటుంబం పెళ్లికి అతిథులుగా విచ్చేసిన వారి కోసం 40 విలాసవంతమైన ఎద్దుల బండ్లలో గేటుదాకా స్వాగతం పలికారు. శ్రీకృష్ణదేవరాయ విజయనగరం తరహాలో పెళ్లి మండపాన్ని బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్లు డిజైన్ చేశారు. విందు భోజన ప్రాంతం బళ్లారి గ్రామంలా డిజైన్ చేశారు. అతిథులను తరలించేందుకు దాదాపు 2000 క్యాబ్‌లు, 15 హెలికాప్టర్లను అద్దెకు తీసుకున్నారు. బెంగళూరులోని ఫైవ్, త్రీ స్టార్ హోటళ్లలో 1,500 విలాసవంతమైన గదులను అతిథుల కోసం ఏర్పాటు చేశారు. వివాహ మండపంలో భద్రత కోసం ఏకంగా 3 వేలమంది పోలీసులను నియమించారు.

మంత్రి జనార్ధన రెడ్డి కుటుంబ సభ్యులందరూ రాజుల వేషధారణలతో కోట్లాది రూపాయల విలువైన బంగారు, డైమండ్‌ నగలు ధరించి వచ్చారు. ఐదు రోజుల పాటు వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పెళ్లి ఏర్పాట్లే ఇంత పెద్దగా ఉంటే వధువు కోసం మరెంత ప్రత్యేక ఏర్పాట్లు చేశారో తెలిస్తే నోరెళ్లబెడతారు. పెళ్లిలో బంగారు దారంతో నేసిన రూ.17 కోట్ల విలువైన కాంచీపురం పట్టుచీర వధువు బ్రాహ్మణి ధరించింది. ఇక ఆమె ధరించిన ఆభరణాల విలువ సుమారు రూ.90 కోట్లు. ముంబై నుంచి వచ్చిన స్పెషల్‌ మేకప్‌ ఆర్టిస్టులతో వధువును ముస్తాబు చేయడానికి రూ.30 లక్షలు ఖర్చుచేశారుమరి. మంత్రిగారి కుమార్తె పెళ్లి సంగతులు గత ఏడేళ్ల నుంచి దేశ వ్యాప్తంగా కథలుకథలుగా చర్చించుకుంటున్నారంటే ఇది ఆషామాషీ పెళ్లికాదన్నమాట.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.