AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఏడుగురు సజీవ దహనం.. 10మందికి తీవ్ర గాయాలు

Tamil Nadu Fire Accident: కాంచీపురం జిల్లా కురువిమలైలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు సజీవ దహనం అయ్యారు.

బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఏడుగురు సజీవ దహనం.. 10మందికి తీవ్ర గాయాలు
Fire Accident
Balaraju Goud
| Edited By: |

Updated on: Mar 22, 2023 | 7:24 PM

Share

తమిళనాడు ఘోర ప్రమాదం జరిగింది. కాంచీపురం జిల్లా కురువిమలైలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్‌, పోలీస్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 30 మంది పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

కురువిమలై వరాలతోట్ ప్రాంతంలో ‘నరేంద్రన్ ఫైర్ వర్క్స్’ అనే ప్రైవేట్ యాజమాన్యంలోని బాణసంచా తయారీ ప్లాంట్ పనిచేస్తోంది. 20 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ప్లాంట్‌లో 30 మందికి పైగా పనిచేస్తున్నారు. ఫ్యాక్టరీ గోడౌన్‌లో భారీ పేలుడు సంభవించింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ప్రమాద బాధితులను ఆటోల్లో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ పేలుడులో ఇప్పటి వరకు ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మరణించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పది మందికి పైగా తీవ్ర గాయాలతో చికిత్స నిమిత్తం కాంచీపురం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేరారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. పేలుడుకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!
కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!
బాత్రూంలో ఈ చిన్న వస్తువును పెట్టండి.. సంపద పెరుగుతుంది
బాత్రూంలో ఈ చిన్న వస్తువును పెట్టండి.. సంపద పెరుగుతుంది
అకస్మాత్తుగా ముఖాముఖి ఎదురుపడ్డ ప్రధాని మోదీ , రాహుల్ గాంధీ..!
అకస్మాత్తుగా ముఖాముఖి ఎదురుపడ్డ ప్రధాని మోదీ , రాహుల్ గాంధీ..!
టాస్ ఓడిన హైదరాబాద్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు
టాస్ ఓడిన హైదరాబాద్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు
ఇంటి గుమ్మం వద్ద ఆవు నిలబడితే ఏం జరుగుతుందో తెలుసా?
ఇంటి గుమ్మం వద్ద ఆవు నిలబడితే ఏం జరుగుతుందో తెలుసా?
సేఫ్టీ పిన్ వెనుక ఈ రంధ్రం కనిపెట్టి.. బిలియన్ డాలర్ల సామ్రాజ్యం!
సేఫ్టీ పిన్ వెనుక ఈ రంధ్రం కనిపెట్టి.. బిలియన్ డాలర్ల సామ్రాజ్యం!
రానున్న అమావాస్యతో ఈ రాశుల వారి జీవితాల్లో వెలుగులు నిండటం ఖాయం
రానున్న అమావాస్యతో ఈ రాశుల వారి జీవితాల్లో వెలుగులు నిండటం ఖాయం
Krishna Vamsi: ఖడ్గంలో శ్రీకాంత్ పాత్ర మిస్సైన హీరో ఎవరో తెలుసా..
Krishna Vamsi: ఖడ్గంలో శ్రీకాంత్ పాత్ర మిస్సైన హీరో ఎవరో తెలుసా..