ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌: నేటితో ముగిసిన సిసోడియా కస్టడీ.. ఏప్రిల్‌ 5 వ వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌

Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఆప్‌ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఈడీ కస్టడీ ముగిసింది. సిసోడియాను కోర్టులో హాజరుపర్చారు పోలీసులు.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌: నేటితో ముగిసిన సిసోడియా కస్టడీ.. ఏప్రిల్‌ 5 వ వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌
Manish Sisodia
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 22, 2023 | 7:24 PM

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఆప్‌ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఈడీ కస్టడీ ముగిసింది. సిసోడియాను కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. ఈడీ కేసులో మనీష్‌ సిసోడియాకు ఏప్రిల్‌ 5వ తేదీ వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది న్యాయస్థానం. సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై ఈనెల 24,25 తేదీల్లో రౌస్‌ అవెన్యూ కోర్టులో విచారణ జరుగుతుంది.

లిక్కర్ స్కాంలో మనీలాండరింగ్ కేసులో ఎదుర్కొంటున్న సిసోడియాను ఈడీ నేడు కోర్టులో హాజరుపరిచింది. ఆయనకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీని మరోసారి పొడిగింది. సిసోడియాకు ఏప్రిల్ 5వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తున్నట్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. మనీశ్ సిసోడియాకు నేటితో ఈడీ కస్టడీ ముగియడంతో, ఆయనను అధికారులు స్పెషల్ జడ్జి ఎంకే నాగ్ ఎదుట హాజరుపరిచారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీశ్ సిసోడియాకు ఇప్పటికే సీబీఐ కస్టడీ కొనసాగుతోంది. మద్యం హోల్ సేల్ వ్యాపారంలో భాగంగా తమకు అనుకూలమైన కంపెనీలకు 12 శాతం లాభాలు చేకూరేలా మద్యం పాలసీ రూపొందించారని ఈడీ కేసులు నమోదు చేసింది. ఢిల్లీ మంత్రివర్గ సమావేశ రికార్డుల్లో ఈ నిర్ణయం ఎక్కడా నమోదు చేయలేదని ఈడీ ఆరోపిస్తోంది. హోల్ సేల్ వ్యాపారులకు అనుకూలంగా విజయ్ నాయర్ నేతృత్వంలో మరికొందరు కలిసి సౌత్ గ్రూప్ సహితంగా ఈ కుట్రకు తెరదీశారని ఈడీ అభియోగాలు మోపింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తరఫున విజయ్ నాయర్ ప్రతినిధిగా వ్యవహరించాడని ఈడీ తమ చార్జీషీట్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ కేసులు నమోదు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం