‘టిప్ టిప్ బర్సా’ అంటూ కలెక్టరేట్ మెట్లపై చిందులు.. కట్‌చేస్తే.. రీల్స్ పిచ్చితో చిక్కుల్లో పడ్డ యువతి..!
రైల్వే స్టేషన్లు, బస్టాప్‌లు, కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలు, పార్కులు తదితర ప్రాంతాల్లో అనుమతి లేకుండా వీడియోలు, ఫోటోలు, రీళ్లు తదితరాలను ఏ వ్యక్తి, సంస్థ రూపొందించకుండా తక్షణమే నిషేధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతే కాదు
రీల్స్ పిచ్చి యువతలో బాగా ముదిరిపోయింది. దీంతో ఎక్కడ పడితే అక్కడ వీడియోలు తీస్తూ జనాల్ని ఇబ్బందిపెడుతున్నారు. బస్సులు, రైళ్లు, కొండలు, గుట్టలు అనే తేడా లేకుండా వీడియోలు తయారు చేస్తున్నారు. రీల్స్, వ్యూస్ కోసం కొందరు ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారు. అలాంటిదే ఇక్కడ ఓ యువతి ఏకంగా కలెక్టరేట్ ఆఫీస్ మెట్లపై డ్యాన్స్ చేస్తూ వీడియో తీసింది. వీడియో వైరల్ కావడంతో జిల్లా మేజిస్ట్రేట్ ఆమెపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. రీల్ మేకింగ్, ఫోటోగ్రఫీ, షూటింగ్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలి ఆదేశాలు జారీ చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…
మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ కలెక్టరేట్ భవనం మెట్లపై ఓ అమ్మాయి సినిమా పాటపై రీల్ చేసింది. ఈ రీల్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పరిపాలనా విభాగంతో చాలా విమర్శలు వచ్చాయి. దాంతో గ్వాలియర్ కలెక్టర్ ఈ విషయంలో చాలా కఠిన చర్యలు తీసుకున్నారు. ఇది అక్కడి కంటెంట్ క్రియేటర్స్ అందరిపై ప్రభావితం చూపనుంది. కలెక్టర్ ఆదేశాలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంతకీ వైరల్ వీడియోలో ఏముందంటే..
కలెక్టరేట్ మెట్లపై ఓ యువతి డ్యాన్స్ చేస్తూ వీడియో తయారు చేసింది. టిప్ టిప్ బర్సా పానీ పాటకు డ్యాన్స్ చేసి వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వివాదం మొదలైంది. ఆ వీడియో వైరల్ కావడంతో కలకలం రేగింది. కలెక్టరేట్‌కు సెలవు రోజున ఆ అమ్మాయి ఇలా డ్యాన్స్ వీడియో రికార్డ్ చేసిందని తెలిసింది. కానీ, ఏకంగా కలెక్టరేట్ కార్యాలయం మెట్లపైనే యువతి ఇలా డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో గ్వాలియర్ పాలకవర్గంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. దాంతో గ్వాలియర్ జిల్లా మేజిస్ట్రేట్ కీలక ఉత్తర్వు జారీ చేశారు. అందులో ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాప్‌లు, చారిత్రక ప్రదేశాలతో సహా బహిరంగ ప్రదేశాలలో అసభ్యకరమైన రీళ్లు, డ్యాన్సులు చేస్తూ వీడియోలు తయారు చేస్తున్నారని, దీని కారణంగా గ్వాలియర్ జిల్లా ప్రతిష్ట మసకబారుతుందని అన్నారు జిల్లా మేజిస్ట్రేట్. అందువల్ల ఇకపై గ్వాలియర్‌లో ఎలాంటి షూటింగ్‌లకైనా తప్పనిసరి అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
तैयब अली रील का दुश्मन हाय-हाय… एक युवती ने ग्वालियर के कलेक्टर ऑफिस में रील क्या बनाई, पार्क तक में #Reels बनाने पर रोक लगा दी गयी। उसे नोटिस थमा दिया गया। अब बताइये ये बेचारे बेरोजगार रील वाले कहाँ जाएं… रील से कमाई की कोशिश कर रहे हैं, उस भी रोक।#AmaJaneDo 😜 pic.twitter.com/cBbkMVx1Oj
— Naval Kant Sinha | नवल कान्त सिन्हा (@navalkant) July 14, 2024
రైల్వే స్టేషన్లు, బస్టాప్‌లు, కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలు, పార్కులు తదితర ప్రాంతాల్లో అనుమతి లేకుండా వీడియోలు, ఫోటోలు, రీళ్లు తదితరాలను ఏ వ్యక్తి, సంస్థ రూపొందించకుండా తక్షణమే నిషేధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతే కాదు ఈ ఉత్తర్వును సామాన్య ప్రజలకు చేరవేయాలని కలెక్టర్ ఉత్తర్వుల్లో కూడా రాశారు. దీని కోసం, మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జిల్లా పంచాయతీ ఈ ఉత్తర్వును విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..