Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NagaBandham: నాగబంధనం అంటే ఏంటి.? ఎందుకు వేస్తారు.? దాని పవర్ ఎంత.? వీడియో..

NagaBandham: నాగబంధనం అంటే ఏంటి.? ఎందుకు వేస్తారు.? దాని పవర్ ఎంత.? వీడియో..

Anil kumar poka

|

Updated on: Jul 17, 2024 | 11:51 AM

మొన్నటి వరకూ అనంత పద్మనాభుడి ఖజానా, నేలమాళిగలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. అనంత పద్మనాభుడి ఆలయ నేలమాళిగల్లో లక్షల కోట్ల ఆదాయం, బంగారం ఉందన్న ప్రచారంజరిగింది. నేలమాళిగల్లో కొన్ని గదులను మాత్రమే తెరిచారు. ఇతర గదుల్లోకి వెళ్లడానికి ఎవరూ సాహసించడంలేదు. ఎందుకంటే అది నాగబంధంతో బంధించి ఉంది. ఇప్పుడు పూరీజగన్నాథుడి ఆలయంలో నేలమాళిగలో కూడా అనంత సంపద ఉందని భావిస్తున్న ఆలయ అధికారులు.. వాటిని తెరవడానికి చాలా ఏర్పాట్లు చేశారు.

మొన్నటి వరకూ అనంత పద్మనాభుడి ఖజానా, నేలమాళిగలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. అనంత పద్మనాభుడి ఆలయ నేలమాళిగల్లో లక్షల కోట్ల ఆదాయం, బంగారం ఉందన్న ప్రచారంజరిగింది. నేలమాళిగల్లో కొన్ని గదులను మాత్రమే తెరిచారు. ఇతర గదుల్లోకి వెళ్లడానికి ఎవరూ సాహసించడంలేదు. ఎందుకంటే అది నాగబంధంతో బంధించి ఉంది. ఇప్పుడు పూరీజగన్నాథుడి ఆలయంలో నేలమాళిగలో కూడా అనంత సంపద ఉందని భావిస్తున్న ఆలయ అధికారులు.. వాటిని తెరవడానికి చాలా ఏర్పాట్లు చేశారు. జూలై 14 మధ్యాహ్నం 1 గంట 27 నిమిషాలకు తలుపులు తెరవాలని ముహూర్తం పెట్టారు. సరిగ్గా ఆ సమయంలోనే ఎందుకు? దీనికేమైనా విశేషం ఉందా? లేక ఏదైనా ప్రత్యేకత ఉందా అంటే అవుననే అంటున్నారు పండితులు. అనంత పద్మనాభుడి ఆలయ నేలమాళిగల్లో మాదిరిగానే జగన్నాథుడి రత్న భాండాగారానికి కూడా నాగబంధనం వేసి ఉండొచ్చని అందరూ భావిస్తున్నారు. అసలు ఈ నాగబంధనం అంటే ఏమిటి? ఎందుకు వేస్తారు? పూర్వకాలం నుంచి కేరళకు చెందిన తాంత్రికులు నాగబంధనం వెయ్యడంలో ప్రసిద్ధులు. అయితే ఈ బంధనం వెయ్యడం అంత సామాన్య విషయం కాదు. తాంత్రిక విద్యలలో అనుభవం ఉన్న సిద్ధ పురుషులు, యోగులు వంటి వారే వీటిని ఒక పద్ధతిలో వేసేవారు. ఇలా వేసిన నాగబంధనం విప్పాలంటే అలాంటి తాంత్రిక శక్తులు కలిగి ఉన్న సిద్ధపురుషుల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈ నాగ బంధనం వేసే సమయంలో కొన్ని విషపూరితమయిన నాగులను ఆవాహనం చేసుకుని మంత్రశక్తితో...

Published on: Jul 16, 2024 06:23 PM