Viral Video: వెరైటీగా ఉంటుందని గులాబ్ జామూన్ సమోసాను ట్రై చేశాడు.. ముక్క నోట్లో వేసుకోగానే నోరెళ్ల బెట్టాడు..
రెగ్యులర్ వంటకాలు తిని విసుగొచ్చిందేమో ఇటీవల కొందరు వెరైటీ వంటకాలు ప్రయత్నిస్తున్నారు. కొత్త కొత్త కాంబినేషన్లతో రెసిపీలు ప్రయత్నిస్తున్నారు.
రెగ్యులర్ వంటకాలు తిని విసుగొచ్చిందేమో ఇటీవల కొందరు వెరైటీ వంటకాలు ప్రయత్నిస్తున్నారు. కొత్త కొత్త కాంబినేషన్లతో రెసిపీలు ప్రయత్నిస్తున్నారు. అనంతరం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కాగా వెరైటీ వంటకాల్లో కొన్ని ఆకట్టుకుంటుంటే.. మరికొన్ని వికారం తెప్పిస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఓ వంటకం ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీకి చెందిన అభిషేక్ అనే ఫుడ్ బ్లాగర్ రోడ్డు పక్కన తిను బండారాలు అమ్మే ఒక దుకాణం వద్దకు వెళ్లాడు. వెరైటీగా ఉటుందని అక్కడ దొరికే గులాబ్ జామూన్ సమోసాను ఆర్డర్ చేశాడు. అయితే అతను మొదటిసారిగా ఈ వంటకాన్ని రుచి చూశాడేమో.. ఒక ముక్క నోట్లో వేసుకోగానే ‘ఇదేం టేస్ట్ రా బాబూ’ అన్న తరహాలో అతను రకరకాల ఎక్స్‌ప్రెషన్లు ఇచ్చాడు.
కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ‘మీరెప్పుడైనా ఈ గులాబ్ జామూన్ సమోసాను ట్రై చేశారా’ అని పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 2 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోను చూస్తున్న నెటిజన్లు ‘అతని ఎక్స్‌ప్రెషన్లు చూస్తే అర్థం కావడం లేదా? ఆ వెరైటీ డిష్ టేస్ట్ ఎలా ఉందో’ అని ఒకరు కామెంట్ పెట్టగా ‘ ఛండాలంగా ఉంది. నేను కూడా తిన్నాను’ అని మరొకరు స్పందించారు. ‘నీ ధైర్యానికి మెచ్చుకోవాలి భయ్యా’ అని ఇంకొకరు కామెంట్ పెట్టారు.
View this post on Instagram
Also Read:
Konidela Upasana: క్రిస్మస్ రోజు ఉపాసన ధరించిన ఈ డ్రస్ ధర ఎంతంటే..
Rajinikanth: మరోసారి మంచి మనసు చాటుకున్న రజనీకాంత్.. పేద విద్యార్థుల కోసం..