AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact check: బబుల్ టీ గురించి మీకు తెలుసా.. ఇందులో ఏం కలుపుతారో తేలిపోయిందోచ్..

బబుల్ టీ.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా..? చాలా మందికి ఇది కొత్తగా అనిపించవచ్చు.. కానీ ఇది ఆసియాలోని అనేక దేశాలలో ప్రసిద్ధ పానీయం. ఉదాహరణకు.. చైనా, తైవాన్ దేశాల్లో ఇది చాలా ఫేమస్. ఇందులో మేక..

Fact check: బబుల్ టీ గురించి మీకు తెలుసా.. ఇందులో ఏం కలుపుతారో తేలిపోయిందోచ్..
Bubble Tea Made With Goat F
Sanjay Kasula
|

Updated on: Dec 23, 2021 | 11:36 AM

Share

బబుల్ టీ.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా..? చాలా మందికి ఇది కొత్తగా అనిపించవచ్చు.. కానీ ఇది ఆసియాలోని అనేక దేశాలలో ప్రసిద్ధ పానీయం. ఉదాహరణకు.. చైనా, తైవాన్ దేశాల్లో ఇది చాలా ఫేమస్. 80వ దశకంలో తైవాన్‌లో బబుల్ చాయ్ తయారు చేసినట్లుగా చరిత్ర చెబుతోంది. కొంత కాలంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో మేక మలం వాడినట్లు పోస్ట్‌లో క్లెయిమ్ చేస్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం?

మేక మలం బబుల్-టీ ప్రోటీన్ కోసం త్రాగబడింది

ఈ బుబల్ చాయ్‌పై సోషల్ మీడియాలో వివిధ రకాల పోస్టులు కనిపిస్తున్నాయి. అందులో చాలా రకాలుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో మేక మలం మిక్స్ చేస్తున్నారని ఫేస్‌బుక్‌లోని అనేక పోస్టుల్లో పేర్కొన్నారు. చైనాలో దీనికి చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇది అక్కడి ధనవంతులకు అధిక ప్రోటీన్ మూలం. ఇందులో రసం, సోయా రసం, ఇతర ద్రవాలతో కలిపిన మేక మలం ఉపయోగిస్తున్నారు.

బబుల్-టీలో మేక మలం ఉందని క్లెయిమ్ చేసే పోస్ట్ 28 నవంబర్ 2021న Facebookలో పోస్ట్ చేయబడింది. ఈ పోస్ట్‌కు 191 స్పందనలు, 155 కామెంట్‌లు వచ్చాయి. దీన్ని ఇప్పటివరకు 21 మంది ఫేస్‌బుక్ వినియోగదారులు షేర్ చేశారు.

View this post on Instagram

A post shared by Bungbuanno (@bungbuanno)

ఫ్యాక్ట్ చెక్ తర్వాత: ఈ పోస్ట్‌లోని నిజాలను తెలుసుకుందాం

1- ఈ పోస్ట్‌లో నిజం తెలుసుకోవడానికి Googleలో ఈ చిత్రాలను రివర్స్‌గా వెతికారు. రివర్స్  సెర్చ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లోని బుయాంగ్‌బున్నో అనే ఫుడ్ బ్లాగర్ ఖాతాలో ఈ ఫోటోలను గుర్తించారు.

2- ఈ ఖాతాలో వియత్నామీస్ భాషలో ఒక పోస్ట్ ఇవ్వబడింది. ఇది అనువదించినప్పుడు చాలా సంగతులు బయటకొచ్చాయి. ఈ పోస్ట్‌లో బబుల్-టీ గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి. పోస్ట్ ప్రకారం, ఈ డ్రింక్‌లో కనిపించే మాత్రలను టాపియోకా పెరల్స్ అంటారు.

3- ఫుడ్ బ్లాగర్ వియత్నాంలోని హో చి మిన్ సిటీలోని ఒక రెస్టారెంట్ నుండి జూన్ 10న ఈ బబుల్ టీని కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఈ టీ గురించి చాలా విషయాలు పంచుకున్నాడు.

4- బబుల్- టీపై ఒక నివేదికను ఫుడ్ అండ్ వైన్ మ్యాగజైన్ ప్రచురించింది. నివేదిక ప్రకారం.. బబుల్-టీ 80లలో తైవాన్‌లో ఉద్భవించింది. ఆ సమయంలో మిల్ట్ టీ చాలా సాధారణం కాబట్టి ఈ విభిన్నమైన టీలో ఐస్ క్యూబ్స్ , టపియోకా ట్యాబ్లెట్స్‌ సహాయంతో తయారుచేస్తారు.

5- హఫ్ పోస్ట్ ప్రకారం, బబుల్-టీలో పడే టపియోకా ముత్యాలు నేల లోపల పెరుగుతున్న ఒక ప్రత్యేక రకం కూరగాయల నుండి తీసినట్లుగా వెల్లడించింది. దాని నుండి పిండిని తయారు చేస్తారు. ఫ్యాక్ట్ చెక్ సమయంలో బబుల్-టీ వంటకాల్లో మేక మలం గురించి ప్రస్తావించబడలేదు.

బబుల్ టీలో ఎంత ప్రోటీన్ ఉందో ఇప్పుడు అర్థం చేసుకోండి

ఇందులో విటమిన్లు, మినరల్స్ తక్కువగా ఉన్నాయని హెల్త్‌లైన్ నివేదిక వెల్లడించింది. దానిలో కార్బోహైడ్రేట్ల ఉనికి కారణంగా ఇది శక్తిని ఇస్తుంది. కానీ ప్రోటీన్ పెద్ద పరిమాణంలో కనుగొనబడలేదు. దాదాపు 470 ml బబుల్-టీలో 1.8 శాతం ప్రోటీన్ మాత్రమే ఉన్నాయి. ఇందులో 317 కేలరీలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి: Pralay Missile: చైనా గుండెల్లో వణుకుపుట్టిస్తున్న ప్రళయ్‌.. భారత క్షిపణి పరీక్ష విజయవంతం..

Viral Video: గాలిపటంతో పాటే గాల్లోకి ఎగిరిపోయాడు.. 30 అడుగుల ఎత్తులో వేలాడాడు.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..