Viral Photo: ఈ ఫోటోలో నక్కిన నక్కను కనిపెట్టండి చూద్దాం.. ఖచ్చితంగా సాల్వ్ చేయలేరు!
సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి ట్రెండింగ్ కంటెంట్ ఎక్కువగా వైరల్ అవుతూ వస్తోంది. ప్రపంచం నలమూలల ఏం వింత జరిగినా...

సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి ట్రెండింగ్ కంటెంట్ ఎక్కువగా వైరల్ అవుతూ వస్తోంది. ప్రపంచం నలమూలల ఏం వింత జరిగినా క్షణాల్లో నెట్టింట దర్శనమిస్తోంది. ఫోటోలు, వీడియోలు, పజిల్స్.. ఇలా ఏదైనా కూడా నెటిజన్లు తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఫోటో పజిల్స్‌పై వ్యూయర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. అందులో ఏ జంతువు/వస్తువు దాగుందో కనిపెట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. తగ్గేదేలే అన్నట్లుగా పజిల్‌ను ఓ పట్టు పడుతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని ఫోటో పజిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో నుంచి ఒకటి ఇప్పుడు మాట్లాడుకుందాం.
పైన పేర్కొన్న ఫోటోలో ఓ నక్క దాగుంది. అదెక్కడుందో కనిపెట్టండి చూద్దాం. ఖచ్చితంగా ఈ ఫోటో పజిల్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. దండకారణ్యంలా కనిపిస్తోన్న ఆ ప్రాంతంలో ఓ నక్క నక్కి ఉంది. నూటికి 95 శాతం మంది ఈ పజిల్‌ను సాల్వ్ చేయలేకపోయారు. ఆ జిత్తులమారి నక్క ఎక్కడుందో గుర్తించలేకపోయారు. ఫోటోగ్రాఫర్ తన పదునైన కెమెరా స్కిల్స్ ఉపయోగించి ఈ ఫోటోను తీశారు. అతడికి కూడా ఇందులో నక్కను కనిపెట్టేందుకు చాలా సమయం పట్టిందని పేర్కొంటూ రెడ్డిట్‌లో పోస్ట్ చేశాడు. మరి మీరు కూడా ఓసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు సమాధానం దొరక్కపోతే క్రింద ఫోటోను చూడండి.
Also Read: కళ్లతో కట్టిపడేస్తున్న ఈ చిన్నది ఇప్పుడు తన అందంతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది.. ఎవరో గుర్తుపట్టారా!
