India Corona Cases: దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. 60 శాతం పూర్తయిన రెండు డోసుల వ్యాక్సినేషన్..
India Corona Cases: దేశంలో కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 7,495 కొత్త కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదవగా..
India Corona Cases: దేశంలో కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 7,495 కొత్త కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదవగా.. వైరస్ కారణంగా 434 మంది మరణించారు. ఇది బుధవారం కంటే 18.6 శాతం ఎక్కువ. ప్రస్తుతం యాక్టివ్ కేసులు ఒక శాతం కంటే తక్కువగా అంటే 0.23 శాతం ఉంది. మార్చి 2020 తర్వాత ఇదే కనిస్ఠ స్థాయి. అదే సమయంలో, గత 24 గంటల్లో 6,960 మంది రోగులు కరోనా నుండి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 98.40 శాతానికి పెరిగింది. ఇది మార్చి 2020 నుండి ఇప్పటి వరకు నమోదైన రికవరీ రేటులో ఇదే అత్యధికం. మొత్తంగా చూసుకుంటే దేశంలో ఇప్పటి వరకు 3,42,08,926 మంది కరోనా నుండి కోలుకున్నారు.
పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. దేశంలో ఓమిక్రాన్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 236కి పెరిగింది. వీరిలో 104 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా, దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 65, ఢిల్లీ లో 64 ఉన్నాయి. వీటి తరువాత స్థానాల్లో తెలంగాణ 24, రాజస్థాన్ 21, కర్ణాటకలో 19, కేరళ 15, గుజరాత్‌లో 14 కేసులు నమోదయ్యాయి. ఇక ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధించారు. అదే సమయంలో, ముంబైలో డిసెంబర్ 31 వరకు సెక్షన్ 144 అమలు చేస్తున్నారు.
60 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 138.96 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. ఇక దేశ జనాభాలో 60 శాతానికి మించి జనాభాకు రెండు డోసుల కోవిడ్ – 19 టీకా పూర్తయింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. హెల్త్ వర్కర్ల అంకిత భావం, ప్రజల సానుకూల స్పందన కారణంగానే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. దేశంలోని కరోనా పరిస్థితిపై ఆయా శాఖల అధికారులతో ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు.
Accomplishing more new feats!
Congratulations India ??
Aided by public participation & dedicated efforts of our health workers, over 60% of the eligible population fully vaccinated now ?#SabkoVaccineMuftVaccine pic.twitter.com/cts7lR8SzA
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 23, 2021
Also read:
Room Heater: రూమ్ హీటర్‌ను వినియోగిస్తున్నారా?.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!