Room Heater: రూమ్ హీటర్‌ను వినియోగిస్తున్నారా?.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!
Room Heater: ప్రస్తుత శీతాకాలంలో గతంలో కంటే ఎక్కువగా చలి తీవ్రత ఉంది. ఈ చలి తీవ్రత నుంచి రూమ్ హీటర్లు ఉపశమనం కలిగిస్తాయి. అయితే, ఈ స్వల్పకాలిక ఉపశమనం ఆరోగ్యానికి తీవ్ర హానీ తలపెడతాయని
Room Heater: ప్రస్తుత శీతాకాలంలో గతంలో కంటే ఎక్కువగా చలి తీవ్రత ఉంది. ఈ చలి తీవ్రత నుంచి రూమ్ హీటర్లు ఉపశమనం కలిగిస్తాయి. అయితే, ఈ స్వల్పకాలిక ఉపశమనం ఆరోగ్యానికి తీవ్ర హానీ తలపెడతాయని నిపుణులు చెబుతున్నారు. చాలా హీటర్లు రెడ్-హాట్ మెటల్ రాడ్లు, సిరామిక్ కోర్లను కలిగి ఉంటాయి. ఇవే శరీరంపై దుష్ప్రభావం చూపుతాయి. ఈ రాడ్ల నుంచి వచ్చే గాలి చాలా పొడిగా ఉంటుంది. ఇది గాలిలోని ఆక్సీజన్‌ను పీల్చుకుని మండుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా శ్వాసకోస సమస్యలతో బాధపడే వ్యక్తి రూమ్ హీటర్‌ను వినియోగిస్తున్నట్లయితే.. తీవ్ర పరిస్థితులు ఎదుర్కొంటారు. ఇది కాకుండా, చర్మానికి సంబంధించిన సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. రూమ్ హీటర్ వల్ల కలిగే నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకోండి.
కంటి వ్యాధులు.. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే వాటిలో తేమ ఉండటం చాలా ముఖ్యం. కానీ కన్వెన్షన్ హీటర్, హాలోజన్ హీటర్, బ్లోవర్ నుంచి వచ్చే పొడి గాలి కళ్లలోని తేమను గ్రహిస్తుంది. ఇది కళ్ళలో దురద, మంట, ఎరుపు, చికాకు కలిగిస్తుంది. అలాగే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంది. చేతులతో కళ్లను పదే పదే తాకడం వల్ల కండ్లకలక వస్తుంది.
శ్వాసకోశ రోగులకు ప్రమాదకరం మీరు ఆస్తమా లేదా ఏదైనా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నట్లయితే రూమ్ హీటర్‌ను ఎక్కువగా ఉపయోగించకూడదు. ఈ హీటర్ గాలిని పొడిగా చేస్తుంది. అలాగే దాని నుండి హానికరమైన వాయువును తొలగిస్తుంది. ఇది మీ శరీరంలోని ఇతర భాగాలకు కూడా హాని తలపెడుతుంది. తద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగించవచ్చు. ఇది కాకుండా, హీటర్ నుంచి వచ్చే పొడి గాలి కారణంగా గొంతు తరచుగా పొడిబారుతుంది. శ్వాసనాళంలో చికాకు, ఊపిరితిత్తులలో అసౌకర్యం, దురద వంటి సమస్యలు తలెత్తుతాయి. హీటర్ గాలి ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తే కఫం సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది.
చర్మ సమస్యలు గది హీటర్, బ్లోవర్ నుండి వచ్చే పొడి గాలి మీ చర్మానికి కూడా హానికరం. దీని కారణంగా, చర్మం పొడిబారడం, దురద, ఎర్రటి మచ్చలు, ముడతలు కూడా ఏర్పడవచ్చు.
ఏం చేయాలి.. 1. రూమ్ హీటర్‌ను వినియోగించడం తగ్గించండి. లేదంటే.. ఆయిల్ హీటర్‌ను కొనుగోలు చేయండి. ఇది గాలిని గది ఉష్ణోగ్రతలో వేడి చేస్తుంది. 2. హీటర్ వినియోగించేప్పుడు.. ఒక కుండలో నీటిని నింపి ఉంచాలి. ఇలా చేయడం ద్వారా గాలిలో తేమ నిలిచి ఉండటానికి సహాయపడుతుంది. 3. హీటర్‌ను ఎప్పుడూ దుస్తుల మధ్య ఉంచకండి. మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. 4. రాత్రిపూట హీటర్‌ను ఆఫ్ చేయడం మర్చిపోవద్దు. గంట లేదా రెండు గంటలు ఆన్ చేసి గది ఉష్ణోగ్రత పెరిగిన తరువాత ఆపేయండి. 5. హీటర్‌కు దూరంగా కూర్చోవాలి.
Also read:
Konidela Upasana: ప్రధానమంత్రితో సమావేశమైన మెగా కోడలు.. ఎందుకంటే..
RRR: జక్కన్న బిగ్ ప్లాన్.. RRR తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అతిథులుగా ఆ ఇద్దరు హీరోలు!
Kamal Haasan: విక్రమ్ సెట్‌లోకి అడుగుపెట్టిన కమల్.. సినిమా విడుదల ఎప్పుడంటే!