Viral Video: ఒరేయ్ చింటూ.! నా తమ్ముడితోనే గేమ్సా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
Trending Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక అన్న వీడియో చర్చనీయాంశంగా మారింది. తన తమ్ముడి కోసం రోడ్డుపై కుక్కతో పోరాడుతున్న సీన్ వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అన్న ప్రేమపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తమ్ముడి కోసం చూపించిన ధైర్యం, తెగువను మొచ్చుకుంటున్నారు.

Watch Viral Video: అత్యవసర సమయంలో ఒకరికొకరు తోడుగా ఉండటం అనేది సాధారణంగా కుటుంబ సంబంధాలలో కనిపించే లక్షణం. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఒక సోదరుడు తన తమ్ముడి కోసం కుక్కతో పోరాడాడు. ఈ వీడియోలో పిల్లల చూపించిన తెగువను నెటిజన్లు ఎంతగానో ఇష్టపడుతున్నారు.
కుక్కతో పోరాడి తమ్ముడిని కాపాడిన అన్న..
సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్‌గా మారింది. అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధాన్ని, ప్రేమను ఈ వీడియో కళ్ళకు కట్టింది. తన తమ్ముడిని కాపాడటం కోసం ఓ అన్నయ్య ఏమాత్రం భయం లేకుండా ఓ కుక్కతో పోరాడాడు.
ఈ వీడియోను @gharkekalesh అనే ఖాతా నుంచి షేర్ చేశారు. ఈ వీడియోలో ఇద్దరు పిల్లలు రోడ్డుపై నుడుచుకుంటూ వెళ్తున్నారు. తన తమ్ముడిపై చినుకులు పడకుండా పైన ఓ దుప్పటి కప్పుకుని జాగ్రత్తగా తీసుకుని వెళ్తున్నాడు అన్న. ఇంతలో వారి వైపు ఓ కుక్క రావడం గమనించిన అన్న.. తన తమ్ముడి దగ్గరికి రాకుండా వెంటనే స్పందించాడు. తమ్ముడిని లాగి వెనక్కి నెట్టి, ఆ కుక్కను తరిమాడు. కాళ్లతో తంతూ ఆ కుక్కను దూరంగా తరిమాడు. తన తమ్ముడిని కాపాడాలనే పట్టుదలతో కుక్కకు అడ్డుగా నిలిచాడు. చివరకు ఆ కుక్క ఇద్దరి నుంచి దూరంగా పారిపోయింది.
Kalesh b/w Dogesh and Siblings: pic.twitter.com/o0ctiTo7ev
— Ghar Ke Kalesh (@gharkekalesh) July 5, 2025
ఈ వీడియో చూసిన నెటిజన్లు అన్న ధైర్యాన్ని, తమ్ముడిపై అతనికున్న ప్రేమను ప్రశంసిస్తున్నారు. “అన్నయ్య అంటే ఇలా ఉండాలి”, “నిజమైన హీరో”, “ఈ పిల్లాడు చాలా ధైర్యవంతుడు” వంటి కామెంట్లు పెడుతున్నారు. ఈ సంఘటన అన్నదమ్ముల బంధం ఎంత గొప్పదో మరోసారి రుజువు చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వేల సంఖ్యలో షేర్ అవుతూ, అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ ఘటన పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని, ముఖ్యంగా తెలియని జంతువుల దగ్గరికి వెళ్ళకుండా చూసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. అలాగే, ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ధైర్యంగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో కూడా తెలియజేస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..