AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: సింహాన్ని తరిమికొట్టిన గ్రామసింహాలు.. వైరల్ అవుతున్న వీడియో.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

Trending Video: అడవికి రాజైన సింహం ముందు ఏ జంతువు నిలబడినా దానికి చివరి క్షణాలు వచ్చాయని అర్థం. కానీ అది అడవుల లెక్క. ఆడవులను దాటి జనావాసాలకు వస్తే లెక్కలన్నీ తలకిందులై పోవాల్సిందే.. ఎందుకంటే గ్రామాల్లో గ్రామసింహాలదే పై చేయి. తామున్న ప్రాంతంలోకి పక్క వీధి కుక్కలనే రానివ్వని ఈ గ్రామసింహాల ముందు ఎవరైనా వెన్ను చూపి పరుగులు పెట్టాల్సిందే. నమ్మలేకపోవతున్నారా.. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దాన్ని చూస్తే నమ్మక తప్పని పరిస్థితి అని ఒప్పుకోవాల్సిందే. ఇంతకీ..

Watch Video: సింహాన్ని తరిమికొట్టిన గ్రామసింహాలు.. వైరల్ అవుతున్న వీడియో.. నెటిజన్లు ఏమంటున్నారంటే..
Representative Image
శివలీల గోపి తుల్వా
|

Updated on: Aug 12, 2023 | 9:45 PM

Share

Trending Video: ఎంతటి భారీ జంతువు అయినా సింహం ముందు వణికిపోవాల్సిందే. ఎందుకంటే అడవి ఏదైనా అక్కడ సింహమే రారాజు. ఈ కారణంగానే సింహంతో తలపడాలని క్రూర మృగాలు కూడా ఆలోచించవు, ఏదైనా మతి భ్రమించి సింహం ముందు నిలబడితే చివరి క్షణాలను అనుభవిస్తున్నాయనే అర్థం. కానీ అది అడవుల లెక్క. ఆడవులను దాటి జనావాసాలకు వస్తే లెక్కలన్నీ తలకిందులై పోవాల్సిందే.. ఎందుకంటే గ్రామాల్లో గ్రామసింహాల (కుక్కల)దే పై చేయి. తామున్న ప్రాంతంలోకి పక్క వీధి కుక్కలనే రానివ్వని ఈ గ్రామసింహాల ముందు ఎవరైనా వెన్ను చూపి పరుగులు పెట్టాల్సిందే. నమ్మలేకపోవతున్నారా.. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దాన్ని చూస్తే నమ్మక తప్పని పరిస్థితి అని ఒప్పుకోవాల్సిందే. ఇంతకీ ఆ వీడియోలో ఏం జరిగిందంటే..

vantalakka_memes అనే ఇన్‌స్టా హ్యాండిల్ నుంచి జూలై 21న షేర్ అయిన వీడియోలో ఓ సింహం ఊరిలోకి ప్రవేశించింది. అంతేనా.. దాని సామ్రాజ్యమే అనుకున్నట్లున్న అది చాలా ఠీవీగా నడుస్తోంది. అయితే నాలుగు కుక్కల గ్యాంగ్ దాని వెంటపడ్డాయి. అంతే.. పరిగెత్తరో అన్నట్లుగా సింహం పరుగులు తీసినా దాన్ని వీధి చివరి వరకు వెంటబడి మరీ తరిమి కొట్టాయి గ్రామసింహాలు. ఈ ఘటన ఎక్కడ ఎప్పుడు జరిగిందో తెలియ రాలేదు కానీ నెటిజన్లను ఆకర్షిస్తోంది. నెటిజన్ల ఆదరణను పొందుతోన్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అందుకు సంబంధించిన వీడియోను మీరు ఇక్కడ చూవచ్చు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో..

కాగా వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కామెంట్లతో తమ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ‘సింహంతో కుక్క: నువ్వు సింహానివైతే నేను గ్రామసింహాన్ని. నీ కంటే నాకు రెండు అక్షరాలు ఎక్కువ’ అని సరదాగా కామెంట్ చేయగా.. మరో నెటిజన్ ‘అందరికీ లోకువై పోయా, చీచీ’ అని సింహం అనుకుంటుందని రాసుకొచ్చాడు. అలాగే ఇంకో నెటిజన్ ‘నువ్వు అడవికి రాజు అయితే అక్కడ ఎక్కువ ! మా విలేజ్ కి మేమే రాజు : గ్రామ సింహం బోల్తే’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు ఎమోజీలతో కూడా కామెంట్ చేస్తున్నారు. మరో వైపు ఈ వీడియోకు ఇప్పటి వరకు దాదాపు 44 వేలకు పైగా లైకులు, 3 లక్షల 32 వేల వీక్షణలు అందాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us