Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: భార్యకు పోటీగా నైటీ వేసుకున్న భర్త.. ఎందుకో తెలిస్తే నవ్వుకోవాల్సిందే.. వైరల్ అవుతున్న వీడియో..

Trending Video: సోషల్ మీడియాలో వైరల్ అవుతుండే వీడియోల్లో కొన్ని మాత్రమే నెటిజన్లను మనసారా నవ్వించగలవు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి తన భార్యకు పోటీగా చేసిన పని ప్రస్తుతం నెటిజన్లకు నవ్వులు పంచుతోంది. దీంతో నెటిజన్లు కూడా రకరకాలుగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి తన భార్యకు వ్యతిరేకంగా ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం.. ఈ రోజుల్లో ఎలాంటి లింగ భేదం లేకుండా అమ్మాయిలు కూడా జిన్స్ ప్యాంట్స్, టీ షర్ట్స్ ధరిస్తున్నారు. అలాగే ఇంట్లో ఉండే సౌకర్యంగా ఉంటుందని నైటీలనే..

Trending Video: భార్యకు పోటీగా నైటీ వేసుకున్న భర్త.. ఎందుకో తెలిస్తే నవ్వుకోవాల్సిందే.. వైరల్ అవుతున్న వీడియో..
Viral Video Visuals
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 12, 2023 | 6:41 PM

Trending Video: సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలా వైరల్ అయ్యే వీడియోల్లో పెంపుడు జంతుకులు, చిన్న పిల్లలు, భార్యభర్తలు, సైన్స్, నేచర్‌కి సంబంధించిన వీడియోలు ప్రధానంగా ఉంటాయి. అయితే వాటిలో కొన్ని వీడియోలు మాత్రమే నెటిజన్లను మనసారా నవ్వించగలవు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి తన భార్యకు పోటీగా చేసిన పని ప్రస్తుతం నెటిజన్లకు నవ్వులు పంచుతోంది. దీంతో నెటిజన్లు కూడా రకరకాలుగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి తన భార్యకు వ్యతిరేకంగా ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

ఈ రోజుల్లో ఎలాంటి లింగ భేదం లేకుండా అమ్మాయిలు కూడా జిన్స్ ప్యాంట్స్, టీ షర్ట్స్ ధరిస్తున్నారు. అలాగే ఇంట్లో ఉండే సౌకర్యంగా ఉంటుందని నైటీలనే ధరిస్తున్నారు. అయితే బయటకు వెళ్తూ తన భార్య జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ వేసుకుందని ఓ వ్యక్తి.. ఆమె ధరించే నైటిని వేసుకున్నాడు. అది చూసిన ఆమె తన భర్తను ‘ఏంటిదీ, నైటీ ఎందుకు వేసుకున్నావు’ అని ప్రశ్నించగా.. అతను ‘నువ్వు జీన్స్ ఎందుకు వేసుకున్నావు అని నేను అడిగానా..’ అని బదులిచ్చాడు. ‘దీన్ని విప్పేయ్’ అని ఆమె అనగా, ‘నాకు మంచిగా ఉంది, నేను వేసుకున్నా, పదా మనం బయటకు పోవాలి కదా’ అన్నాడు. ‘నేను జీన్స్ వేసుకోవడం, మీరు నైటీ వేసుకోవడం ఒకటేనా విప్పేయ్’ అని అమె అన్నందుకు ‘నాకు మంచిగా ఉంది ఈ నైటీ’ అని సమాధానం ఇచ్చాడు. ఇలా సాగుతున్న వీడియోను చిత్రీకరించి నెట్టింట పోస్ట్ చేశారు. ఈ క్రమంలో వైరల్ అయిన ఈ వీడియో ఇన్‌స్టాలోని memer_chouhan_3.0 అనే మిమర్ పేజ్ నుంచి తాజాగా షేర్ చేశారు. 

ఇవి కూడా చదవండి

కాగా, ఈ వీడియోపై నెటిజన్లు చాలా సరదాగా కామెంట్ చేస్తున్నారు. ‘లుంగీకి మాత్రమే నైటీ పోటీ.. జీన్స్ ప్యాంట్స్‌కి లెగ్గిన్స్ మాత్రమే పోటీ.. వెంటనే అవి వేసుకో పో బ్రో’ అంటూ ఓ నెటిజన్ సరదాగా రాసుకొచ్చారు. ఈ క్రమంలోనే మరో నెటిజన్ ‘మీ లాంటివారే మాకు ఆదర్శం, తగ్గొద్దు అన్నా. మీ వెనుక మేము ఉన్నాం’ అంటూ కామెంట్ చేశారు. ఇంకా ‘వీడియోలో మంచి సందేశం ఉంది, దీన్ని అందరూ ఫాలో అయిపోవాలి’ అని ఇంకొకరు అభిప్రాయపడ్డారు. మరోవైపు ఈ వీడియోకు ఇప్పటివరకు 94 వేల 4 వందలకు పైగా లైకులు లభించాయి.