AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఒక్క సెకన్ ఆలస్యమైతే.. పసిబిడ్డకు పునర్జన్మ ప్రసాదించిన బస్సు సిబ్బంది!

కొన్ని క్షణాల ఆలస్యం జరిగి ఉంటే ఓ చిన్నారి ప్రాణాలు ప్రమాదంలో పడేవి. కానీ బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తి, కండక్టర్ చాకచక్యంతో ఓ పసిబిడ్డ సురక్షితంగా బయటపడింది. ఈ ఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Watch Video: ఒక్క సెకన్ ఆలస్యమైతే.. పసిబిడ్డకు పునర్జన్మ ప్రసాదించిన బస్సు సిబ్బంది!
Bus Driver Saves Toddler
Balaraju Goud
|

Updated on: Jun 12, 2026 | 1:10 PM

Share

కొన్ని క్షణాల ఆలస్యం జరిగి ఉంటే ఓ చిన్నారి ప్రాణాలు ప్రమాదంలో పడేవి. కానీ బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తి, కండక్టర్ చాకచక్యంతో ఓ పసిబిడ్డ సురక్షితంగా బయటపడింది. ఈ ఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మలప్పురం జిల్లాలోని ఓ ప్రధాన రహదారిపై పాకుతూ వచ్చిన చిన్నారి ఒక్కసారిగా హైవేపైకి చేరుకుంది. అదే సమయంలో ఆ మార్గంలో ఓ ప్రైవేట్ బస్సు వేగంగా వస్తోంది. అయితే డ్రైవర్ దూరం నుంచే రోడ్డుపై చిన్నారిని గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యాడు. క్షణం ఆలస్యం చేయకుండా అత్యవసర బ్రేకులు వేయడంతో బస్సు చిన్నారికి కొద్ది అడుగుల దూరంలోనే ఆగిపోయింది.

బస్సు ఆగగానే కండక్టర్ వెంటనే కిందకు దిగి రోడ్డుపై ఉన్న చిన్నారిని ఎత్తుకుని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాడు. దీంతో ఎదురుగా వస్తున్న ఇతర వాహనాల నుంచి కూడా చిన్నారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా తప్పింది. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. తమ బిడ్డ ప్రాణాపాయం నుంచి బయటపడిందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు డ్రైవర్, కండక్టర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

వీడియో ఇక్కడ చూడండి…

ఈ ఘటన ఎలా జరిగిందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. చిన్నారి హైవేపైకి ఎలా చేరుకుందనే విషయాన్ని స్థానికులు, అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే డ్రైవర్, కండక్టర్ చూపిన అప్రమత్తతను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. “ఓ క్షణంలో ప్రాణం కాపాడిన హీరోలు”, “ఇలాంటి డ్రైవర్లు సమాజానికి ఆదర్శం” అంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
డ్రైవర్ సమయస్ఫూర్తికి నెటిజన్ల సెల్యూట్!
డ్రైవర్ సమయస్ఫూర్తికి నెటిజన్ల సెల్యూట్!
స్నానం చేసిన వెంటనే ఏసీ రూమ్‌లోకి వెళ్తే ఏమవుతుంది..?
స్నానం చేసిన వెంటనే ఏసీ రూమ్‌లోకి వెళ్తే ఏమవుతుంది..?
పక్షుల కిలకిలరావాలతో మీ తోట మురిసిపోవాలా? అద్భుతమైన టిప్స్ ఇవే!
పక్షుల కిలకిలరావాలతో మీ తోట మురిసిపోవాలా? అద్భుతమైన టిప్స్ ఇవే!
ఈ పనులను జూన్ 15వ తేదీలోగా పూర్తి చేయండి.. లేకపోతే భారీ నష్టాలు..
ఈ పనులను జూన్ 15వ తేదీలోగా పూర్తి చేయండి.. లేకపోతే భారీ నష్టాలు..
భారత నావికుల మృతిపై ఇరాన్ సంతాపం..!
భారత నావికుల మృతిపై ఇరాన్ సంతాపం..!
సౌత్ ఇండస్ట్రీలో చార్లీ చాప్లిన్.. 40 ఏళ్లు నవ్వించిన నవ్వుల రేడు
సౌత్ ఇండస్ట్రీలో చార్లీ చాప్లిన్.. 40 ఏళ్లు నవ్వించిన నవ్వుల రేడు
ఫోన్ చేసి ఇంట్లో అందరినీ పేర్లతో అడుగుతాడు: కోదండరామిరెడ్డి
ఫోన్ చేసి ఇంట్లో అందరినీ పేర్లతో అడుగుతాడు: కోదండరామిరెడ్డి
మీ ఆధార్ నంబర్‌తో వేరేవాళ్లు మీ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా..
మీ ఆధార్ నంబర్‌తో వేరేవాళ్లు మీ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా..
అల్లం కొంటున్నారా? అయితే జాగ్రత్త! నకిలీ గుర్తించే సింపుల్ ట్రిక్
అల్లం కొంటున్నారా? అయితే జాగ్రత్త! నకిలీ గుర్తించే సింపుల్ ట్రిక్
ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా రూ.7 లక్షల బీమా..నామినీ ఖాతాలోకి
ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా రూ.7 లక్షల బీమా..నామినీ ఖాతాలోకి