Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: నాతోనే ఆటలా..! ఐస్‌క్రీమ్ కోసం రచ్చరచ్చ చేసిన చిన్నది.. వైరల్ అవుతున్న వీడియో..

Trending Video: చిన్న పిల్లలు చేసే హంగామా అయితే అంతా ఇంత ఉండదు. వారు చేసే చేష్టలను చూస్తే ఎవరికైనా తమ బాల్యం గుర్తుకు రావాల్సిందే. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వేలాది సంఖ్యలో షేర్ అవుతుంటాయి. అలా షేర్ అయిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందులో ఓ బుడ్డోడు ఐస్ క్రీమ్ స్టాల్ ఎదుట చేసిన రచ్చ నెటిజన్లను కట్టిపడేస్తుంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు సరదా కామెంట్లతో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో అసలు ఏం జరిగిందంటే.. 

Trending Video: నాతోనే ఆటలా..! ఐస్‌క్రీమ్ కోసం రచ్చరచ్చ చేసిన చిన్నది.. వైరల్ అవుతున్న వీడియో..
Viral Video Visuals
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 12, 2023 | 8:39 PM

Trending Video: సోషల్ మీడియాలో షేర్ అయ్యే వీడియోల్లో పెంపుడు జంతువులు, చిన్న పిల్లల వీడియోలకు ఉండే క్రేజ్ వేరే లెవెల్‌ల్లో ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు చేసే హంగామా అయితే అంతా ఇంత ఉండదు. వారు చేసే చేష్టలను చూస్తే ఎవరికైనా తమ బాల్యం గుర్తుకు రావాల్సిందే. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వేలాది సంఖ్యలో షేర్ అవుతుంటాయి. అలా షేర్ అయిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందులో ఓ బుడ్డోడు ఐస్ క్రీమ్ స్టాల్ ఎదుట చేసిన రచ్చ నెటిజన్లను కట్టిపడేస్తుంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు సరదా కామెంట్లతో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో అసలు ఏం జరిగిందంటే..

జూలై 12న aslii.ile అనే ఇన్‌స్టా ఖాతా నుంచి షేర్ అయిన ఈ వీడియోలో ఓ చిన్నారి ఐస్‌ క్రీమ్ స్టాల్ ఎదుట హంగామా చేయడాన్ని మీరు చూడవచ్చు. ఐస్ క్రీమ్ స్టాల్ వ్యక్తి ఆ చిన్నారికి ఐస్ క్రీమ్ ఇచ్చే క్రమంలో కొంచెం సరదా పట్టించాలనుకుని దాన్ని ఇవ్వకుండా ఉంటాడు. దీంతో చిర్రేత్తిన చిన్నారి ఐస్ క్రీమ్ స్టాల్‌ని తన చిన్ని చిన్ని కాళ్లతో తన్నడం ప్రారంభించింది. ఐస్ క్రీమ్ వద్దు, ఏం వద్దు అని ఓ అడుగు పక్కకు వేసి, మళ్లీ స్టాల్‌ని తన్నింది. ఇలా సాగిన వీడియోలో కొన్ని క్షణాలే ఉన్నప్పటికీ నెటిజన్లకు బాగా నచ్చేసింది. దీంతో ఆ వీడియోకు నెట్టింట విపరీతమైన ఆదరణ లభిస్తోంది. నెట్టింట షేర్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 34 లక్షల వీక్షణలు, 10 లక్షల 69 వేలకు పైగా లైకులు, దాదాపు 17 వేల 2 వందల కామెంట్లు వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు.. ఆ వీడియో నెటిజన్లకు ఎంతగా నచ్చిందో తెలుసుకోవాలంటే.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Aslı ile.. (@aslii.ile)

మరోవైపు ఈ వీడియోపై నెటిజన్ల స్పందనలు చాలా సరదా సరదాగా ఉన్నాయి. ఈ క్రమంలో ఓ నెటిజన్ తాను కూడా తన చిన్నప్పుడు ఇలాగే చేశానని, ప్రతిదానికి అలకే ఆయుధంగా చేసుకునేవాడినని చెప్పుకొచ్చారు. అలాగే ఐస్ క్రీమ్ కోసం వచ్చినప్పుడు ఇవ్వాలి కానీ ఆడించకూడదు, ఆడిస్తే ఇలాగే ఉంటుందని మరో నెటిజన్ సరదాగా రాసుకొచ్చారు. ఈ చిన్నదాని ప్రవర్తనలో తప్పులేదని, చిన్నప్పుడు అంతా అలాగే చేస్తారని ఇంకో నెటిజన్ కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..