AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake: మీ ఇంట్లో ఈ వాస్తు తప్పులు చేస్తే పాములు పరిగెత్తుకుంటూ వస్తాయి..ఈ రహస్యాలు తెలుసుకోండి..

మండుతున్న ఎండలు మనుషులనే కాదు.. మూగజీవాలను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో విషపూరిత పాములు జనావాసాల్లోకి వస్తున్నాయి. అయితే కొన్ని ఇళ్లకే పాములు ఎందుకు వస్తాయి..? మన ఇంట్లోని వాస్తు దోషాలు కూడా కారణమా..? వాస్తు శాస్త్రం ప్రకారం మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు పాములకు ఆహ్వానం పలుకుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Snake: మీ ఇంట్లో ఈ వాస్తు తప్పులు చేస్తే పాములు పరిగెత్తుకుంటూ వస్తాయి..ఈ రహస్యాలు తెలుసుకోండి..
Vastu Tips To Prevent Snakes At Home
Krishna S
|

Updated on: May 10, 2026 | 1:40 PM

Share

ఎండలు ముదురుతున్న కొద్దీ భూమిలోని వేడిని తట్టుకోలేక విషపూరిత జీవులు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఇళ్ల చుట్టుపక్కల, కొన్నిసార్లు నేరుగా ఇంట్లోకి పాములు ప్రవేశిస్తున్న ఘటనలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అయితే, పాములు మన ఇంట్లోకి రావడానికి కేవలం ప్రకృతి సిద్ధమైన కారణాలే కాకుండా.. మనం చేసే కొన్ని వాస్తు తప్పులు, అపరిశుభ్రత కూడా ప్రధాన కారణాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతికూల శక్తి ఎక్కడైతే పేరుకుపోతుందో, అక్కడ ఇలాంటి విష జీవుల సంచారం ఎక్కువగా ఉంటుంది.

ఎలుకల సంచారం – రాహువు ప్రభావం

వాస్తు శాస్త్రంలో మురికిని, చెత్తను రాహువుకు ప్రతీకగా భావిస్తారు. ఇంట్లో పాత సామాన్లు, అట్టపెట్టెలు, విరిగిన వస్తువులు పేరుకుపోతే అక్కడ ఎలుకలు తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. పాములకు ఎలుకలు ప్రధాన ఆహారం. ఎలుకల వాసనను పసిగడుతూ పాములు అతి సులభంగా మీ గదుల్లోకి ప్రవేశిస్తాయి. కాబట్టి, స్టోర్ రూమ్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ప్రాథమిక సూత్రం.

సాలెగూళ్లు, మానసిక ఒత్తిడి

చాలామంది ఇంట్లో సాలెగూళ్లను నిర్లక్ష్యం చేస్తారు. కానీ వాస్తు ప్రకారం.. సాలెగూళ్లు ప్రతికూల శక్తికి నిలయాలు. ఇవి ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గందరగోళం, మానసిక ప్రశాంతత కరువవ్వడం జరుగుతుంది. పాములు ఎప్పుడూ చీకటిగా, ఎవరూ కదలని సంక్లిష్టమైన ప్రదేశాల్లో దాక్కోవడానికి ఇష్టపడతాయి. సాలెగూళ్లు పేరుకుపోయిన మూలలు పాములకు సురక్షితమైన ఆవాసాలుగా మారుతాయి.

ఈశాన్య దిశలో అపవిత్రత

వాస్తు పురుషుడి సిద్ధాంతం ప్రకారం ఇంటికి ‘ఈశాన్యం’ శిరస్సు లాంటిది. ఈ దిశ ఎప్పుడూ పవిత్రంగా, ఖాళీగా, వెలుతురుతో ఉండాలి. ఈశాన్య మూలలో తేమ ఎక్కువగా ఉండటం, చెత్త వేయడం లేదా అక్కడ చీకటిగా ఉంచడం వల్ల వాస్తు దోషం ఏర్పడుతుంది. చల్లదనం కోసం వెతికే పాములు ఇటువంటి తేమ ఉన్న చీకటి మూలలను తమ నివాసంగా మార్చుకుంటాయి.

ఇంటి ఆవరణలో ఉండకూడని చెట్లు

వాస్తు ప్రకారం ఇంటికి అతి సమీపంలో చింత చెట్టు లేదా పత్తి చెట్లు ఉండటం అశుభం. ఈ చెట్లు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయని పెద్దల నమ్మకం. పైగా చింత చెట్టు దట్టమైన కొమ్మలు, పత్తి చెట్ల పరిసరాలు పాములకు దాక్కోవడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. ఇంటి చుట్టూ పిచ్చి మొక్కలు, పొదలు పెరగకుండా జాగ్రత్త పడాలి.

బ్రహ్మస్థానంలో భారీ వస్తువులు

ఇంటి మధ్య భాగాన్ని బ్రహ్మస్థానం అంటారు. ఇది ఆకాశ తత్వానికి సంబంధించింది. ఇక్కడ గాలి, వెలుతురు ధారాళంగా ఉండాలి. వేసవిలో ఈ ప్రదేశంలో భారీ అలంకరణ వస్తువులు లేదా బరువులు ఉంచితే శక్తి ప్రవాహం ఆగిపోతుంది. ఇది ఇంట్లో ఒక విధమైన బరువును, వేడిని సృష్టిస్తుంది. ఇటువంటి స్తంభించిన శక్తి ఉన్న చోటుకి విషపూరిత జీవులు ఆకర్షించబడే అవకాశం ఉందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

పాముల దరిచేరకుండా ఏం చేయాలి?

సర్పగంధ – తులసి: మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద లేదా ఆవరణలో సర్పగంధ మొక్కను నాటండి. ఈ మొక్క వాసనకు పాములు దరిచేరవని నమ్ముతారు. అలాగే తులసి మొక్క ఇంట్లో సానుకూల శక్తిని పెంచి విష వాయువులను నిరోధిస్తుంది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం వాస్తు శాస్త్రం, జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us
తమిళనాడు సీఎంగా దళపతి విజయ్.. ఐపీఎల్ కప్పు మళ్ళీ చెన్నైకేనా?
తమిళనాడు సీఎంగా దళపతి విజయ్.. ఐపీఎల్ కప్పు మళ్ళీ చెన్నైకేనా?
మీ ఇంట్లో ఈ వాస్తు తప్పులు చేస్తే పాములు పరిగెత్తుకుంటూ వస్తాయి
మీ ఇంట్లో ఈ వాస్తు తప్పులు చేస్తే పాములు పరిగెత్తుకుంటూ వస్తాయి
ఆ హీరో రొమాంటిక్ స్టైల్‌‌ను ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు..
ఆ హీరో రొమాంటిక్ స్టైల్‌‌ను ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు..
EPFO లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై పీఎఫ్‌ విత్‌డ్రా మరింత ఈజీ
EPFO లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై పీఎఫ్‌ విత్‌డ్రా మరింత ఈజీ
వాస్తు టిప్స్: ఈ వస్తువులు కొత్త ఇంటికి తీసుకెళ్తే సమస్యలు తప్పవు
వాస్తు టిప్స్: ఈ వస్తువులు కొత్త ఇంటికి తీసుకెళ్తే సమస్యలు తప్పవు
టిఫిన్‌లో వడ రాలేదని ఆ నటుడు షూటింగ్ నుంచి వెళ్లిపోయాడు: రవిబాబు
టిఫిన్‌లో వడ రాలేదని ఆ నటుడు షూటింగ్ నుంచి వెళ్లిపోయాడు: రవిబాబు
మునక్కాయతో ఇలా వెల్లుల్లి కారం కూర చేశారంటే..
మునక్కాయతో ఇలా వెల్లుల్లి కారం కూర చేశారంటే..
కాకరకాయ ఇష్టం లేనోళ్లకి కుడా ఫేవరెట్ కర్రీ అవ్వాల్సిందే.!
కాకరకాయ ఇష్టం లేనోళ్లకి కుడా ఫేవరెట్ కర్రీ అవ్వాల్సిందే.!
Petrol: మే 15 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు..!
Petrol: మే 15 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు..!
పవన్ కళ్యాణ్ డ్రస్ మొత్తం రక్తం.. అయినా లెక్కచేయలేదు..
పవన్ కళ్యాణ్ డ్రస్ మొత్తం రక్తం.. అయినా లెక్కచేయలేదు..