అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు గూగుల్‌లో ఏం సెర్చ్ చేస్తారో తెలుసా..?
గూగుల్‌లో ఇండియన్ అమ్మాయిలు ఏం వెతుకుతున్నారు? టీనేజ్ అమ్మాయిలు ఫ్యాషన్, ఫిట్‌నెస్ మాత్రమే కాదు.. మనసులోని సీక్రెట్ ప్రశ్నలకు కూడా సమాధానాలు వెతుకుతున్నారు.. దాదాపు 2 కోట్ల మంది యువతులు ఇంటర్నెట్‌లో దేనికోసం రహస్యంగా సెర్చ్ చేస్తున్నారు? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఈ ఆధునిక యుగంలో భారతీయ మహిళలు, ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలు ఆన్‌లైన్ ప్రపంచంలో చురుగ్గా ఉంటున్నారు. పలు నివేదికల ప్రకారం.. టీనేజ్ అమ్మాయిలు ఆన్‌లైన్‌లో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ మహిళలు తమ దైనందిన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇంటర్నెట్‌ను ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగిస్తున్నారు. ఈ యువతరం అమ్మాయిలు గూగుల్‌లో దేని కోసం ఎక్కువగా వెతుకుతున్నారు..? అనే అంశంపై వచ్చిన నివేదికలు అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించాయి.
అమ్మాయిల సెర్చింగ్‌లో వైవిధ్యం
గూగుల్ సంస్థ తన శోధన ఫలితాలపై సమర్పించిన నివేదికలో యువ తరం అమ్మాయిల డిజిటల్ వినియోగం గురించి పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ టీనేజ్ అమ్మాయిలు కేవలం వినోదం కోసమే కాకుండా తమ వ్యక్తిగత జీవితం, అభివృద్ధి కోసం ఇంటర్నెట్‌ను వాడుతున్నారు.
అమ్మాయిలు ఎక్కువగా వెతికే అంశాలు ఇవే:
పర్సనల్ లైఫ్ – శారీరక ఆరోగ్యం: ఆరోగ్య చిట్కాలు, ఫిట్‌నెస్, వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన ప్రశ్నలను అమ్మాయిలు గూగుల్‌లో సెర్చ్ చేస్తారని తెలుస్తోంది.
ఫ్యాషన్ – అందం: లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్‌లు, మేకప్ ట్యుటోరియల్స్, బ్యూటీ చిట్కాలు గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తారు.
కెరీర్ – విద్య: వివిధ ఉద్యోగ అవకాశాలు, ఉన్నత విద్యకు సంబంధించిన సమాచారం, కోర్సు వివరాలను కూడా గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేస్తారు.
సాహిత్యం – వినోదం: కళలు, సాహిత్యం, పాటలు, సినిమాలు – వినోదానికి సంబంధించిన విషయాలు.
సామాజిక అంశాలు: సమాజంలో ప్రస్తుత వ్యవహారాలు, ట్రెండింగ్ అంశాలపై శోధనలు.
సున్నితమైన – వ్యక్తిగత సమస్యలు
అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ టీనేజ్ అమ్మాయిలు తమ మొబైల్ ఇంటర్నెట్‌ను వ్యక్తిగత సమస్యలకు లేదా సున్నితమైన విషయాలకు సమాధానాలు వెతకడానికి ప్రైవేట్‌గా ఉపయోగిస్తున్నారు. సాధారణంగా సమాజంలో ఇతరులతో పంచుకోలేని లేదా చెప్పలేని కొన్ని వ్యక్తిగత, సున్నితమైన విషయాలకు సంబంధించిన సమాధానాల కోసం వారు ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఈ శోధనలు వారి అంతర్గత ఆందోళనలు, సందేహాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అత్యంత ప్రైవేట్ విషయాలను కూడా కవర్ చేస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి.
ఈ నివేదిక దేశంలోని యువ మహిళలు, ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలు ఇంటర్నెట్‌ను కేవలం కాలక్షేపం కోసమే కాకుండా తమ జీవితాలను మెరుగుపరుచుకోవడానికి, తమ ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి ఒక విశ్వసనీయ సాధనంగా చూస్తున్నారని స్పష్టం చేస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
