AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smallest Beer in the world: ప్రపంచంలోనే అతిచిన్న బీర్‌ బాటిల్.. దీని ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే

world's smallest beer bottle: సాధారణంగా బీర్ బాటిల్ సైజు ఎంతుంటుందో అందరికీ తెలుసూ.. కానీ బియ్యం గింజసైజులో బీర్‌ బాటిల్ ఉందంటే మీరు నమ్ముతారా?.. నమ్మరు కదూ.. కానీ మేం చెప్పిబోయే విషయం విన్నాకా.. మీరు కచ్చితంగా నమ్మితీరాల్సిందే.. ఎందుకంటే ప్రసిద్ధ డానిష్ బీర్ కంపెనీ కార్ల్స్‌బర్గ్ ఈ అసాధ్యాన్ని సాధ్యం చేసింది. వారు ప్రపంచంలోనే అతి చిన్న బీరు బాటిల్‌ను విడుదల చేసింది. ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.

Smallest Beer in the world: ప్రపంచంలోనే అతిచిన్న బీర్‌ బాటిల్.. దీని ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
The Smallest Beer Bottle In The World
Anand T
|

Updated on: Oct 26, 2025 | 6:14 PM

Share

ప్రసిద్ధ డానిష్ బీర్ కంపెనీ అయిన కార్ల్స్‌బర్గ్ ఈ ఫీట్‌ను సాధించింది. ప్రపంచంలోనే అతిచిన్న బీర్ బాటిల్‌ను తయారు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిన్న సీసా కేవలం 12 మిల్లీమీటర్ల పొడవు, బియ్యం గింజ పరిమాణంలో ఉంటుంది. ఇందులో కేవలం 0.005 మిళ్లీలీటర్ లేదా ఒక చుక్క బీరు మాత్రమే పడుతుంది. దీని ప్రత్యేక ఏమిటంటే ఇది ఆల్కహాల్ లేని బీర్. ఈ ప్రయోగం వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, మద్యపాన అలవాట్లను నియంత్రించడం, మితమైన మద్యపానాన్ని ప్రోత్సహించడం కోసం ఈ సంస్థ ఈ బీర్ బాటిల్‌ను తయారు చేసింది.

ఈ చిన్న బాటిల్ AI టెక్నాలజీతో తయారు చేసినట్లు అనిపించినప్పటికీ, ఇది వాస్తవానికి పూర్తిగా స్వీడిష్ నిపుణుల పని. ప్రయోగశాల పరికరాలను తయారు చేసే గ్లాస్‌కంపోనెంట్స్ అనే సంస్థ ఈ గాజును రూపొందించింది. అప్పుడు RISE పరిశోధనా సంస్థ అధునాతన ఫైబర్-ఆప్టిక్ ట్యూబ్‌ల ద్వారా ఈ చిన్న బాటిల్‌లో బీర్‌ను నింపిది.

ఆసా స్ట్రాండ్ అనే ఓ లేడీ ఈ బాటిల్‌ను తయారు చేసింది. బాటిల్ మూత నుండి లేబుల్, పెయింట్ వరకు ప్రతిదీ ఆమె చేతితో వేసింది. ఇంత చిన్న వస్తువుపై పని చేయడం చాలా సవాలుతో కూడుకున్నప్పటికీ, ఆసా దానిని ఓపిక, ఆసక్తితో పూర్తి చేసింది. సీసా చిన్నదే, కానీ దాని వెనుక ఉన్న సందేశం పెద్దదని కార్ల్స్‌బర్గ్ స్వీడన్‌లోని కమ్యూనికేషన్స్ హెడ్ కాస్పర్ డేనియల్సన్ అన్నారు. “మద్యపానం విషయంలో ప్రజలు బాధ్యతాయుతంగా ఉండాలనే ఆచోచనతోనే దీన్ని విడుదల చేసినట్టు ఆయన తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us