మరణం అంచుల్లోంచి మాతృమూర్తి కౌగిలిట్లోకి.. కేరళ వాసికి ‘పునర్జన్మ’..!
సౌదీ అరేబియాలో గత రెండు దశాబ్దాలుగా మరణశిక్షను ఎదుర్కొంటూ, నిరంతర భయం నీడలో గడిపిన కేరళలోని కోజికోడ్ వాసి అబ్దుల్ రహీం ఎట్టకేలకు క్షేమంగా స్వదేశానికి తిరిగి వచ్చారు. గురువారం (మే 28) ఆయన కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా, అక్కడ ఆయనకు అపూర్వమైన, ఘన స్వాగతం లభించింది. ఒక సామాన్యుడి ప్రాణాన్ని కాపాడేందుకు కేరళ సమాజం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవతావాదులతో కలిసి చేసిన అద్భుత పోరాటం ఈ రోజు అబ్దుల్ రహీంను తన కుటుంబం వద్దకు చేర్చింది.

సౌదీ అరేబియాలో గత రెండు దశాబ్దాలుగా మరణశిక్షను ఎదుర్కొంటూ, నిరంతర భయం నీడలో గడిపిన కేరళలోని కోజికోడ్ వాసి అబ్దుల్ రహీం ఎట్టకేలకు క్షేమంగా స్వదేశానికి తిరిగి వచ్చారు. గురువారం (మే 28) ఆయన కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా, అక్కడ ఆయనకు అపూర్వమైన, ఘన స్వాగతం లభించింది. ఒక సామాన్యుడి ప్రాణాన్ని కాపాడేందుకు కేరళ సమాజం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవతావాదులతో కలిసి చేసిన అద్భుత పోరాటం ఈ రోజు అబ్దుల్ రహీంను తన కుటుంబం వద్దకు చేర్చింది.
అబ్దుల్ రహీం వస్తున్నారనే వార్తతో కరిపూర్ విమానాశ్రయం జనసందోహంగా మారింది. ఆయనను చూసేందుకు, స్వాగతించేందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులతో పాటు వందలాది మంది ప్రజలు, మీడియా ప్రతినిధులు తరలివచ్చారు. ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త బాబీ చెమ్మనూర్ విమానాశ్రయంలో రహీంను ఆలింగనం చేసుకుని సాదరంగా ఆహ్వానించారు. సుదీర్ఘ జైలు జీవితం తర్వాత స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్న రహీం, తన కోసం తరలివచ్చిన జనసమూహాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రజలందరికీ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతూ, థంబ్స్-అప్ చూపిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. “నన్ను బతికించి, నా కుటుంబం వద్దకు చేర్చడానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను” అని రహీం కళ్ల వెంట నీళ్లు పెట్టుకుంటూ మీడియాతో అన్నారు.
విమానాశ్రయం నుండి రహీం నేరుగా కోజికోడ్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ఇంటి వద్ద పండగ వాతావరణం నెలకొంది. వాహనం దిగి లోపలికి వెళ్లిన వెంటనే, తన వృద్ధాప్య తల్లిని చూసి రహీం తట్టుకోలేకపోయారు. 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తన కొడుకును కళ్లారా చూసుకున్న ఆ తల్లి, కొడుకును గట్టిగా కౌగిలించుకుని కుమిలి కుమిలి ఏడ్చింది. రహీం కూడా తన తల్లిని పదేపదే ముద్దాడుతూ, కౌగిలించుకుంటూ కన్నీరు మున్నీరయ్యారు. తల్లికొడుకుల ఈ సుదీర్ఘ కలయికను చూసి అక్కడున్న ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చాయి. మరో విశేషమేమిటంటే, రహీం స్వదేశానికి తిరిగి రావడం సరిగ్గా బక్రీద్ పండుగ సమయంలోనే జరిగింది. మరణం అంచుల్లో నుండి కొడుకు తిరిగి రావడం, అది కూడా పండుగ రోజే కావడం ఆ కుటుంబంలోనే కాకుండా ఆ గ్రామం మొత్తంలో ఆనందాన్ని రెట్టింపు చేసింది.
అసలు రహీం ఎలా చిక్కుకున్నాడు?
2006లో, కేరళకు చెందిన అబ్దుల్ రహీం ఒక సాధారణ డ్రైవర్ ఉద్యోగం కోసం సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడ అతను ఒక దివ్యాంగుడైన (పక్షవాతం ఉన్న) సౌదీ బాలుడికి సంరక్షకుడిగా బాధ్యతలు చేపట్టాడు. ఒకరోజు కారులో ప్రయాణిస్తుండగా, ఆ బాలుడికి శ్వాస అందించే లైఫ్ సపోర్ట్ మెషిన్ (వెన్సిలేటర్) ట్యూబ్ ప్రమాదవశాత్తు రహీం చేతికి తగిలి ఊడిపోయింది. దీనివల్ల ఆ బాలుడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదాన్ని హత్యగా భావించిన సౌదీ పోలీసులు రహీంను అరెస్టు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం, 2018లో సౌదీ న్యాయస్థానం అతనికి మరణశిక్ష విధించింది. బాధితుడి కుటుంబం క్షమాభిక్ష పెట్టడానికి నిరాకరించడంతో రహీం చావుకు అత్యంత సమీపంలోకి వెళ్లాడు.
రూ. 34 కోట్ల అద్భుత మానవతా సాయం!
చివరి ప్రయత్నంగా, బాధితుడి కుటుంబం ఒక షరతు విధించింది. 15 మిలియన్ల సౌదీ రియాల్స్ (సుమారు రూ. 34 కోట్లు) బ్లడ్ మనీ చెల్లిస్తే క్షమిస్తామని అంగీకరించారు. ఒక పేద డ్రైవర్ కుటుంబానికి అంత పెద్ద మొత్తం సమకూర్చడం అసాధ్యమైన పని. కానీ, కేరళ ప్రజలు, ప్రవాస భారతీయులు కలిసి ‘అబ్దుల్ రహీం లీగల్ యాక్షన్ కమిటీ’గా ఏర్పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా క్రౌడ్ ఫండింగ్ ద్వారా విరాళాలు సేకరించారు. కేవలం కొన్ని రోజుల్లోనే యాప్స్, సోషల్ మీడియా ద్వారా రూ. 34 కోట్లు వసూలు చేసి సౌదీ కోర్టుకు సమర్పించారు. ఈ అద్భుత మానవతా ప్రయత్నం వల్ల సౌదీ కోర్టు మరణశిక్షను రద్దు చేసి, రహీంను విడుదల చేసింది. మానవత్వం ఇంకా బతికే ఉందని, ఒకరినొకరు ఆదుకుంటే ఎలాంటి అసాధ్యాన్నైనా సాధ్యం చేయవచ్చని రహీం కథ నిరూపించింది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
