AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఏపీలో పాఠశాలల్లో చదివే బాలురు అందరికీ ఒకటే హెయిట్ స్టైల్.. ఉత్వర్వులు జారీ..

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే బాలురకు ఏకరీతి హెయిర్ కట్ తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. స్పైకీ, ముల్లెట్, ఫేడ్ ప్యాటర్న్స్, ఎక్స్‌ట్రీమ్ ఫేడ్, హెయిర్ కలరింగ్ వంటి హెయిర్ స్టైల్స్‌ను నిషేధిస్తూ, విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమానత్వ భావన, చదువుపై ఏకాగ్రత పెంపొందించడమే ఈ నిర్ణయం లక్ష్యమని అధికారులు తెలిపారు.

Andhra: ఏపీలో పాఠశాలల్లో చదివే బాలురు అందరికీ ఒకటే హెయిట్ స్టైల్.. ఉత్వర్వులు జారీ..
Andhra Students
B Ravi Kumar
| Edited By: |

Updated on: Jul 20, 2026 | 11:03 AM

Share

సినిమాలు, సోషల్ మీడియా, క్రీడాకారుల ప్రభావంతో విభిన్న హెయిర్ స్టైల్స్‌ను అనుసరించే విద్యార్థులకు ఇకపై బ్రేక్ పడనుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే బాలురందరూ ఒకే తరహా హెయిర్ కట్‌తో పాఠశాలకు రావాలని రాష్ట్ర విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

చదువుపై దృష్టి.. క్రమశిక్షణే లక్ష్యం

పాఠశాలల్లో కొందరు విద్యార్థులు సినీ హీరోలు, క్రికెటర్లను అనుకరిస్తూ విభిన్న హెయిర్ స్టైల్స్‌తో వస్తుండటంతో చదువుకంటే రూపురేఖలపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు విద్యాశాఖ గుర్తించింది. విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమానత్వ భావన పెంపొందించడంతో పాటు చదువుపై ఏకాగ్రత పెంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ హెయిర్ స్టైల్స్‌కు నిషేధం

విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం పాఠశాలల్లో ఈ క్రింది హెయిర్ స్టైల్స్‌ను అనుమతించరు.

స్పైకీ (Spiky)

ముల్లెట్ (Mullet)

ఫేడ్ ప్యాటర్న్స్ (Fade Patterns)

ఎక్స్‌ట్రీమ్ ఫేడ్ (Extreme Fade)

హెయిర్ కలరింగ్ (Hair Coloring)

ఇలాంటి హెయిర్ స్టైల్స్ పాఠశాల వాతావరణాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, తోటి విద్యార్థుల దృష్టిని కూడా మరల్చే అవకాశం ఉందని విద్యాశాఖ పేర్కొంది.

అన్ని పాఠశాలలకు వర్తింపు

ఈ ‘ఏకరీతి హెయిర్ స్టైల్ విధానం’ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటికీ వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ విధానం వల్ల విద్యార్థుల మధ్య అనవసర పోటీ, రూపురేఖలపై ఆసక్తి తగ్గి, చదువు, క్రమశిక్షణ, పాఠశాల సంస్కృతిపై మరింత దృష్టి పెరిగే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

Students Haircut

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తక్కువ తీసుకుంటున్నామని సంబంర పడకండి.. ఈ అలవాటే యమ డేంజర్
తక్కువ తీసుకుంటున్నామని సంబంర పడకండి.. ఈ అలవాటే యమ డేంజర్
ఏపీ పాఠశాలల్లోని బాలురు ఒకే హెయిర్ స్టైల్ పాటించాల్సిందే..
ఏపీ పాఠశాలల్లోని బాలురు ఒకే హెయిర్ స్టైల్ పాటించాల్సిందే..
తరగతి గదిలో చిన్నారిని బంధించి.. ఇంటికెళ్లిన టీచర్! కట్ చేస్తే
తరగతి గదిలో చిన్నారిని బంధించి.. ఇంటికెళ్లిన టీచర్! కట్ చేస్తే
సచిన్, కోహ్లీలకు కూడా సాధ్యం కాని అరుదైన రికార్డు సాధించిన రోహిత్
సచిన్, కోహ్లీలకు కూడా సాధ్యం కాని అరుదైన రికార్డు సాధించిన రోహిత్
నెల రోజులుగా దేశంలో అనేక పరిణామాలు జరిగాయి: ప్రధాని మోదీ
నెల రోజులుగా దేశంలో అనేక పరిణామాలు జరిగాయి: ప్రధాని మోదీ
చేతి కర్ర సాయంతోనే ఈవెంట్‌కు వరుణ్ తేజ్..
చేతి కర్ర సాయంతోనే ఈవెంట్‌కు వరుణ్ తేజ్..
తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త
తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త
NEET OMR షీట్ల గోల్‌మాల్.. 707 మార్కులొస్తే ఫలితాల్లో 217 స్కోర్
NEET OMR షీట్ల గోల్‌మాల్.. 707 మార్కులొస్తే ఫలితాల్లో 217 స్కోర్
గృహప్రవేశం నుంచి వివాహం వరకు.. ప్రతి శుభకార్యంలో కలశం ఎందుకు...
గృహప్రవేశం నుంచి వివాహం వరకు.. ప్రతి శుభకార్యంలో కలశం ఎందుకు...
బంగారం, వెండి ధరల్లో బిగ్ ఛేంజ్.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
బంగారం, వెండి ధరల్లో బిగ్ ఛేంజ్.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?