AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Tej: కాలికి గాయం.. చేతి కర్ర సాయంతోనే ఈవెంట్‌కు వరుణ్ తేజ్..

టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న లేటేస్ట్ మూవీ కొరియన్ కనకరాజు. హారర్ కామెడీ నేపథ్యంలో అనంతపూర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల చివరి దశలో ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్.

Varun Tej: కాలికి గాయం.. చేతి కర్ర సాయంతోనే ఈవెంట్‌కు వరుణ్ తేజ్..
Varun Tej
Rajitha Chanti
|

Updated on: Jul 20, 2026 | 10:40 AM

Share

టాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా కొరియన్ కనకరాజు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిస్తున్న ఈ హారర్ కామెడీ డ్రామాను ఆగస్ట్ 7న విడుదల చేయనున్నారు. ఇదివరకే షూటింగ్ కంప్లీట్ కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే అనంతపురం అభిమానుల సమక్షంలో ఈ చిత్రంలోని రాసా గుమ్మాడి అనే పాటను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అయితే ఈ వేడుకకు వరుణ్ తేజ్ చేతికర్ర సాయంతో సరిగ్గా నడవలేక ఇబ్బంది పడుతూ వచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ వేడుకలో పాల్గోన్న ఆయన తన అభిమానులు, ప్రేక్షకులతో భావోద్వేగంగా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సినిమా షూటింగ్‌లో చోటుచేసుకున్న అనుభవాలు, రాయలసీమతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని ఈ సందర్భంగా పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Sudhakar : నేను కోమాలో ఉన్నప్పుడు ఆసుపత్రికి వచ్చి చూసిన హీరో అతడే.. నటుడు సుధాకర్..

అనంతపూర్‌లోనే రాసా గుమ్మాడి పాటను రిలీజ్ చేయడానికి గల కారణాన్ని వరుణ్ తేజ్ వివరిస్తూ, గని సినిమా షూటింగ్‌ గతేడాది ఇక్కడే (ఉరవకొండ, పెనుగొండ, కొట్టాలిపల్లి) జరిగిందని తెలిపారు. ఇది ఈ ప్రాంతం నేపథ్యంతో కూడిన కథ కాబట్టి, సెంటిమెంట్‌గా భావించి అనంతపూర్‌ నుంచే ప్రమోషన్లు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఇక్కడి ప్రేక్షకుల ముందు తమ పాటను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందని, ఈ పాటను చూసిన మొదటి ప్రేక్షకులు మీరే అని అన్నారు. చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకుని డాన్స్ చేయడానికి ప్రయత్నించానని, గని చిత్రం, పాటల చిత్రీకరణను తాను ఎంతో ఆస్వాదించానని వరుణ్ తేజ్ తెలిపారు. అయితే, దురదృష్టవశాత్తు కాలు గాయం కారణంగా వేదికపై స్టెప్ వేయలేకపోయానని తన గాయాన్ని గురించి వెల్లడించారు. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్‌కు, ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. వారి గురించి ముందు ముందు జరిగే ఫంక్షన్లలో మరింత వివరంగా మాట్లాడుతానని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో చాలా గొప్ప మనిషి.. ఆయన పేరు వినగానే రజినీకాంత్ సిగరెట్ పడేసి నిలబడ్డారు.. తనికెళ్ల భరణి..

గత మూడు నెలలుగా తాను ఇంటి నుంచి బయటకు రాలేకపోయానని, ఇంతమంది జనాలను చూసి తన గుండె నిండిపోయిందని వరుణ్ తేజ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో తనను స్వాగతించిన అనంతపూర్ HUDA చైర్మన్ T.C. వరుణ్ గారికి, చిరంజీవి రాష్ట్ర యువత ప్రెసిడెంట్ భవానీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. షూటింగ్ సమయంలో T.C. వరుణ్ గారు తనను చాలా బాగా చూసుకున్నారని, డైట్ చేస్తున్నానని తెలిసి ఇంటి నుంచి భోజనాలు పంపించారని గుర్తు చేసుకున్నారు. అనంతపూర్ టోల్ గేట్ దగ్గర నుంచి భవానీ గారు తమకు దద్దరిల్లే స్వాగతం పలికారని అన్నారు. ఆగస్టు 7వ తేదీన గని సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని, అందరికీ నచ్చి, ఎంటర్‌టైన్ చేసి, సినిమా బాగుందని చెప్పాలని కోరుకుంటున్నట్లు వరుణ్ తేజ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Srikanth: ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. చాలా దెబ్బ పడింది.. హీరో శ్రీకాంత్..

ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..

Follow Us