Viral News: 39 నాణేలు, 37 అయస్కాంతాలను మింగేసిన వ్యక్తి.. కారణం ఇదే!
కొన్ని సంఘటనలు నిజంగానే ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇలా కూడా జరుగుతాయా? ఇలా కూడా చేస్తారా అని విస్మయానికి లోను చేస్తాయి. తాజాగా ఓ వ్యక్తి చేసిన పని ఇలాగే ఉంది. తన బాడీ బిల్డింగ్ కోసం ఏకంగా 39 నాణేలాను, 39 అయస్కాంతాలను మింగేశాడు. అయితే నాణేలు మింగిన వ్యక్తి మానసిక సమస్యలతో బాధ పడుతున్నట్లు తేలింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా..
కొన్ని సంఘటనలు నిజంగానే ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇలా కూడా జరుగుతాయా? ఇలా కూడా చేస్తారా అని విస్మయానికి లోను చేస్తాయి. తాజాగా ఓ వ్యక్తి చేసిన పని ఇలాగే ఉంది. తన బాడీ బిల్డింగ్ కోసం ఏకంగా 39 నాణేలాను, 39 అయస్కాంతాలను మింగేశాడు. అయితే నాణేలు మింగిన వ్యక్తి మానసిక సమస్యలతో బాధ పడుతున్నట్లు తేలింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు ఇది ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల వ్యక్తి 20 రోజుల క్రితం తీవ్రమైన కడుపు నొప్పితో బాధ పడుతున్నాడు. ఆహారం, నీరు కూడా తీసుకోలేకపోతున్నాడు. అతని పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు అతన్ని ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఆ యువకుడిని చెక్ చేసి.. పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో అతని కడుపులో భారీ మొత్తంలో నాణేలు, అయస్కాంతాలు ఉన్నట్లు గుర్తించారు. అవి ప్లేగులను మొత్తం బ్లాక్ చేసినట్లు నిర్థారించారు. ఆ తర్వాత వెంటనే ఆలస్యం చేయకుండా.. యువకుడికి ఆపరేషన్ చేసి.. అతని కడుపులో నుంచి 39 నాణేలు, 37 అయస్కాంతాలను బయటకు తీశారు.
నాణేలన్నీ ఒకటి, రెండు, ఐదు రూపాయల కాయిన్స్ కాగా.. హార్ట్, స్టార్, బుల్లెట్, ట్రయాంగిల్ షేప్‌లో ఉన్న అయస్కాంతాలను బయటకు తీశారు. వాటిని చూసి కుటుంబ సభ్యులు, స్థానిక జనం షాక్‌కి గురయ్యారు. దీంతో సదరు వ్యక్తులు ఫొటోలు తీసి.. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అది కాస్తా వైరల్‌గా మారింది. కాగా ప్రస్తుతం యువకుడు కోలుకుంటున్నాడని.. అతని శరీర నిర్మాణానికి జింక్ సహాయ పడుతుందనే ఉద్దేశంలోనే రోగి.. నాణేలు, అయస్కాంతాలు మింగినట్లు డాక్టర్ల విచారణలో తేలింది.