Dead Rat : బాబోయ్.. చికెన్‌ కర్రీలో చచ్చిన ఎలుక..! ప్రముఖ రెస్టారెంట్‌లో కస్టమర్లకు ఊహించని షాక్

వెంటనే వివేక్ రెస్టారెంట్ యజమానిని నిలదీయగా నిర్లక్ష్యంగా సమాదానం ఇచ్చారంటూ వాపోయాడు. దాంతో వివేక్ కుమార్ ఇదంతా వీడియో రికార్డ్ చేసి అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్‌ చేశాడు. దాంతో వీడియో కాస్త వైరల్‌గా మారింది.

Dead Rat : బాబోయ్.. చికెన్‌ కర్రీలో చచ్చిన ఎలుక..! ప్రముఖ రెస్టారెంట్‌లో కస్టమర్లకు ఊహించని షాక్
Rat
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 10, 2023 | 2:45 PM

మనం ఇంట్లో తినే భోజనం కంటే కాస్త టేస్టీగా, వెరైటీగా తినాలనుకున్నప్పుడు ఏదైనా హోటల్ లేదా దాబాకు వెళ్లాలని నిర్ణయించుకుంటాము. అయితే హోటళ్లు, దాబాలు వంటి ప్రదేశాల్లో వంట చేసేటప్పుడు సరైన పరిశుభ్రత పాటిస్తారా లేదా అనే విషయం మనకు అంతగా తెలియదు. చాలా సార్లు హోటళ్లు, దాబాలు వంటి ప్రదేశాలలో కల్తీ ఆహారం, పరిశుభ్రతలో నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఇందులో మరింత అసహ్యకరమైన విషయం మరోకటి తెరపైకి వచ్చింది. దాబాలో చికెన్‌ కర్రీలో ఎలుకలు కనిపించిన జుగుప్సకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దాబాలో చికెన్ కర్రీ తిన్న కస్టమర్లకు ఊహించని షాక్‌ తగిలినంత పనైంది. అందరం కలిసి హ్యాపీగా నాన్‌వెజ్‌ తింటూ ఎంజాయ్‌ చేద్దామనుకున్న కస్టమర్లకు.. చికెన్‌ కర్రీలో చచ్చిన ఎలుకలు కనిపించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ఆధారంగా దాబాలో ఓ కస్టమర్ ఆర్డర్ చేసిన చికెన్‌లో చనిపోయిన ఎలుక కనిపించిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో పంజాబ్‌లోని లూథియానాకు చెందినదిగా తెలిసింది. నాన్‌ వెజ్‌లో చనిపోయిన ఎలుక కనిపించడంతో కస్టమర్‌ కంగుతిన్నాడు. తీవ్ర ఆగ్రహంతో తనకు సప్లై చేసిన భోజనంలో ఎలుక కనిపించిన దృశ్యాన్ని వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాబా యాజమాన్యం నిర్లక్ష్యంపై నెటిజన్లు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కస్టమర్‌ వివేక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తన కుటుంబంతో కలిసి లూథియానాలోని ఓ దాబాకు వెళ్లాడు. చికెన్ కర్రీ ఆర్డర్ చేశాడు. సప్లై చేసిన భోజనంలో కొంత తిన్న తర్వాత అనుమానం వచ్చింది. భోజనం ఏదో తేడాగా ఉందని గమనించారు. తీరా కర్రీ బౌల్లోకి చూసేసరికి ప్లేట్‌లో చనిపోయిన ఎలుక కనిపించడంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే వివేక్ రెస్టారెంట్ యజమానిని నిలదీయగా నిర్లక్ష్యంగా సమాదానం ఇచ్చారంటూ వాపోయాడు. దాంతో వివేక్ కుమార్ ఇదంతా వీడియో రికార్డ్ చేసి అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్‌ చేశాడు. దాంతో వీడియో కాస్త వైరల్‌గా మారింది.

కాగా, ఈ కేసులో హోటల్ యజమానిపై కేసు నమోదైంది. ఫీల్డ్ గంజ్ ప్రాంతంలోని ప్రేమ్ నగర్‌కు చెందిన వివేక్ కుమార్ ఆహారంలో చనిపోయిన ఎలుక కనిపించింది. వివేక్ కుమార్ ఫిర్యాదు ఆధారంగా లూథియానా సిటీ పోలీసులు హోటల్ యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వెంటనే చర్యలు తీసుకున్నారు. ఆదివారం అర్థరాత్రి విశ్వకర్మ చౌక్ సమీపంలోని ప్రకాష్ ధాబాలో తాను ఆర్డర్ చేసిన ప్లేట్‌లో చనిపోయిన ఎలుక కనిపించడంతో తాను, తన కుటుంబ సభ్యులు అస్వస్థతకు గురయ్యారని వివేక్ కుమార్ తెలిపారు.