పెళ్లికి వస్తే అలాంటి గిఫ్ట్‌లే తీసుకురండి.. పెళ్లి కూతురి వెరైటీ కండీషన్‌.. ఎక్కడంటే..

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ పోస్ట్‌పై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఇలా బహుమతి కోరే ఆలోచన తప్పు అంటున్నారు చాలా మంది. ప్రేమతో ఇచ్చే బహుమతి వెలకట్టలేనిది అంటూ చాలా మంది చెబుతున్నారు. ఇది నిజంగా అత్యాశ అంటుండగా, వధువు నిర్ణయాన్ని కొందరు సమర్థించారు.

పెళ్లికి వస్తే అలాంటి గిఫ్ట్‌లే తీసుకురండి.. పెళ్లి కూతురి వెరైటీ కండీషన్‌.. ఎక్కడంటే..
Bride
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 10, 2023 | 1:25 PM

పెళ్లిలో జరిగే అనేక సంఘటనల గురించి తరచూ సోషల్ మీడియాలో చాలా వీడియోలు కనిపిస్తుంటాయి. అవన్నీ చూసేందుకు ఆశ్చర్యంగానూ, మరికొన్ని ఫన్నీగానూ ఉంటుంటాయి. అయితే, ఇలాంటి వధువు గురించి మీరు ఇంతకు ముందెన్నడూ వినుండరు. ఇది నిజంగా వింత సంఘటన అనే చెప్పాలి. ఎందుకంటే..సాధారణంగా పెళ్లికి వచ్చే అతిథులు వారి స్థోమతకు తగ్గట్టుగా వధూవరులకు బహుమతులు ఇస్తుంటారు. అయితే పెళ్లికి వస్తే చిన్నచిన్న బహుమతులు తీసుకురావద్దంటూ అతిథులకు కండిషన్‌ పెట్టింది ఇక్కడో వధువు. అంతేకాదు..వారు తెచ్చిన గిఫ్ట్‌ కనీసం రూ.4000ల కంటే తక్కువ కాకుండా ఉండాలంటూ రేటు కూడా ఫిక్స్‌ చేసి చెప్పింది. దీంతో ఈ వార్త కాస్త సోషల్ మీడియలో వైరల్‌గా మారింది.

వధువు తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. సోషల్ మీడియా రెడ్డిట్‌లో రీట్విట్‌ చేయటంతో మరింత వైరల్ అవుతోంది. ఇంతకీ వధువు పెట్టిన పోస్ట్‌లో కండీషన్‌ ఏంటంటే..పెళ్లికి వచ్చే వారికోసం చాలా డబ్బు ఖర్చుపెట్టి ఏర్పాట్లు చేశామని చెప్పింది. అతిథులు, బంధుమిత్రుల కోసం ఓపెన్ బార్‌లో భోజనం ఏర్పాటు చేశామని, అందుకే ఎవరైనా తన పెళ్లికి ఉట్టి చేతుల్తో వస్తే తనకు చాలా బాధగా ఉంటుందని అందులో రాసింది. అందుకే రూ. 4200లకు తగ్గకుండా బహుమతి ఇవ్వాలని ఆహ్వాన పత్రికతో పాటు రాయించింది. అయితే, ఇదంతా బహుమతికి సంబంధించిన విషయం కాదని కూడా చెబుతూనే.. బహుమతి అడగడం కూడా చెడ్డ విషయం కాదని రాసింది.

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ పోస్ట్‌పై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఇలా బహుమతి కోరే ఆలోచన తప్పు అంటున్నారు చాలా మంది. ప్రేమతో ఇచ్చే బహుమతి వెలకట్టలేనిది అంటూ చాలా మంది చెబుతున్నారు. ఇది నిజంగా అత్యాశ అంటుండగా, వధువు నిర్ణయాన్ని కొందరు సమర్థించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?