Viral Video: సోషల్ మీడియాలో జంతువుల చిత్రాలు, వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. జంతువులకు సంబంధించిన కంటెంట్‌ను ఇంటర్నెట్‌లో ఎక్కువగా ఇష్టపడుతారు. జంతు ప్రేమికులు ఖచ్చితమైన ఫోటో కోసం అడవిలో గంటలు గంటలు గడుపుతారు. అయితే జంతువులు నది, చెరువులో స్నానం చేయడాన్ని చూసారు కానీ ఈ ఆవు కాస్త భిన్నంగా స్విమ్మింగ్ ఫూల్‌లో స్నానం చేస్తుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆవు మొదటగా నిర్మాణంలో ఉన్న కొలనులోకి తొంగి చూసి నీళ్లు తాగడానికి ప్రయత్నిస్తుంది. అయితే ముందరి కాళ్లు స్విమ్మింగ్ ఫూల్‌లోకి జారుతాయి. దీంతో బ్యాలెన్స్ ఆగని ఆవు ఒక్కసారిగా స్విమ్మింగ్ ఫూల్‌లోకి జంప్ చేస్తుంది. దీంతో అందులో ఈతకొడుతున్న జనాలు ఆవుని చూసి భయపడిపోతారు. వెంటనే స్విమ్మింగ్ ఫూల్ ఒడ్డుకు చేరుకుంటారు. అయితే ఆవు అనుకోకుండా పడిపోవడంతో బయటికి రావడానికి స్విమ్మింగ్ ఫూల్‌లో అటు ఇటు తిరగడం మనం వీడియోలో గమనించవచ్చు.
పాపం ఆవు దూకనైతే దూకింది కానీ బయటికిరావడానికి దారి తెలియక ఇబ్బందిపడుతుంటుంది. స్విమ్మింగ్ ఫూల్ గోడపై కాళ్లు పెట్టి పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తుంటుంది కానీ బరువుకు నీటిలో మునిగిపోతుంటుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. లైక్, షేర్స్ చేస్తున్నారు. ఈ వీడియో Instagram లో hayate vahsh 2 అనే పేరుతో పోస్ట్ చేశారు. ఈత కొలనులో ఆవు స్నానం చేయడం మొదటిసారి చూస్తున్నామని చాలా మంది కామెంట్ చేశారు. కొంతమంది అయ్యోపాపం ఆవు అంటూ బాధపడ్డారు.
View this post on Instagram