Viral Video: రద్దీ రోడ్డు మధ్యలో బైక్ మీద యువత స్టంట్.. ప్రాణాలంటే లెక్కలేదు అంటున్న నెటిజన్లు..
కరకాల స్టంట్స్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్ ఫామ్ లో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ స్టంట్స్ చేస్తూ కొందరు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టడమే కాదు.. ఇతరుల ప్రాణాలను సైతం ప్రమాదంలో పడేస్తున్నవారి సంఖ్యకు కూడా కొదవు లేదు. తాజాగా ఓ వీడియో నెట్టింట్లో స్టంట్ కు సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూస్తే ఎవరైనా సరే షాక్ తింటారు.
సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల రీల్స్ చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా స్టంట్స్ చేస్తున్న వీడియోలకు ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. స్త్రీ, పురుషులు అనే బేధం లేదు.. వయసుతో సంబంధం లేదు రకరకాల స్టంట్స్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్ ఫామ్ లో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ స్టంట్స్ చేస్తూ కొందరు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టడమే కాదు.. ఇతరుల ప్రాణాలను సైతం ప్రమాదంలో పడేస్తున్నవారి సంఖ్యకు కూడా కొదవు లేదు. తాజాగా ఓ వీడియో నెట్టింట్లో స్టంట్ కు సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూస్తే ఎవరైనా సరే షాక్ తింటారు.
రోడ్డుమీద రకరకాల వాహనాలు ప్రయాణం చేస్తూ రద్దీగా ఉంది. అటువంటి రద్దీ ఉన్న రోడ్డుమీద కొందరు యువకులు రకరకాల విన్యాసాలను చేస్తున్నారు. ఈ ఘటనబెంగుళూరు సిటీలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫుల్ రష్ ఉన్న రోడ్డుమీద కొంతమంది యువకులు బైక్స్ మీద రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. వీరి స్టంట్స్ ఎవరో రికార్డ్ చేశారు. దీంతో యువకులు ఈ ప్రమాదకరమైన విన్యాసాలను ఫిబ్రవరి 25వ తేదీ మధ్యాహ్నం 3:50 గంటలకు యలహంకలోని ఓ బిజీ బిజీ రహదారిపై జరిగినట్లు తెలుస్తోంది.
ఇక్కడ వీడియో చూడండి
Wheelie at Yelahanka caught on camera. Can we get the maniac's bike seized? This was on 25th Feb at 3:50pm @yelahankatrfps @blrcitytraffic pic.twitter.com/OstJAN0JRu
— ThirdEye (@3rdEyeDude) February 27, 2024
ఈ వీడియోను వెనుక నడుపుతున్న వాహనం రికార్డ్ చేసింది. వీరి వెనుక వెళ్తున్న వాహనదారులు రికార్డ్ చేశారు. రోడ్డు మధ్యలో యువత చేస్తున్న చేస్తున్న విన్యాసాలు చూస్తే ఎవరికైనా సరే ప్రాణాలంటే భయం లేదని.. అసలు పోలీసులు ఉంటారని లెక్క కూడా చేయడం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, ఈ వాహనాన్ని సీజ్ చేసి వారిపై చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెప్పారు.
ఈ క్లిప్ @3rdEyeDude అనే ఖాతా ద్వారా Xలో భాగస్వామ్యం చేయబడింది. ఈ వార్త రాసే సమయానికి 14 వేల మందికి పైగా చూశారు. ఈ వీడియో వైరల్ కావడంతో, ప్రజలు దానిపై కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఈ రోజుల్లో యువతలో చట్టం అంటే భయం అసలు లేదు.. పూర్తిగా నశిస్తోంది’ అని ఒక వినియోగదారు రాశారు. ‘బెంగళూరు రోడ్లపై బైక్‌ల బెడద పెరుగుతోంది’ అని మరొకరు రాశారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..