Viral Video: ఎంట్రా ఇది.. నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. ఎలుగుబంటికి ఎదురుపడ్డ మనిషి..! ఆ తరువాత

దూకుడుగా ఉండే ఎలుగుబంట్లు ఎదురుపడితే..వాటి పంజా నుంచి తప్పించుకోవటం కూడా అంత సులువేం కాదు. మనం ఎలుగుబంటిని ఎదుర్కొలేం కాబట్టి.. వాటికి దొరక్కుండా పరిగెత్తడం తప్ప మరేమీ చేయలేము. లేదంటే కొందరు చెప్పినట్టుగా వాటి ముందు ఊపిరాడకుండా పడుకోవాలి.

Viral Video: ఎంట్రా ఇది.. నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. ఎలుగుబంటికి ఎదురుపడ్డ మనిషి..! ఆ తరువాత
Bear Comes Close To A Man
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 21, 2023 | 11:35 AM

ఎలుగుబంట్లు అత్యంత ప్రమాదకరమైన అడవి జంతువులలో ఒకటి. తరచుగా జనావాసాల్లోకి వచ్చి చేరుతున్న ఎలుగుబంట్లు ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తుంటాయి. ఎలుగుబంటి దాడులకు సంబంధించిన వార్తలు కూడా వస్తుంటాయి. దూకుడుగా ఉండే ఎలుగుబంట్లు ఎదురుపడితే..వాటి పంజా నుంచి తప్పించుకోవటం కూడా అంత సులువేం కాదు. మనం ఎలుగుబంటిని ఎదుర్కొలేం కాబట్టి.. వాటికి దొరక్కుండా పరిగెత్తడం తప్ప మరేమీ చేయలేము. లేదంటే కొందరు చెప్పినట్టుగా వాటి ముందు ఊపిరాడకుండా పడుకోవాలి. ఈ రెండూ కాకుండా ఓ వ్యక్తి రియాక్షన్ ద్వారానే ఎలుగుబంటిని ఎదిరించాడు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒక ఇంటి వారండాలో ఒక పెద్దాయన హాయిగా పడుకుని సెల్‌ఫోన్‌ చేస్తున్నాడు. ఊహించని విధంగా అప్పుడే అక్కడికి ఒక ఎలుగుబంటి ఎంట్రీ ఇచ్చింది. ఏదో అర్జెంట్‌ పని ఉండి వచ్చినట్టుగా ఆ ఎలుగుబంటి సరాసరి ఇంట్లోకే వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే, ఏదో శబ్ధం వినిపించినట్టుగా అనిపించటంతో ఆ పెద్దాయన తిరిగి చూశాడు.. ఊహించని విధంగా ఎలుగుబంటిని చూసిన అతడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. కంగుతిన్న అతడు అయ్యాబాబోయ్‌ అన్నట్టుగా ముడుచుకుపోయినట్టుగా ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చాడు. అతని రియాక్షన్‌కు ఎలుగుబంటి కూడా భయపడిపోయింది. వేగంగా నడుస్తూ వెళ్తున్న ఎలుగుబంటి ఒక్కసారిగా ఆగిపోయింది. అతన్నే కాసేపు తదేకంగా చూసి.. అక్కడ్నుంచి పరుగలంఘించింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ఏప్రిల్ 12న షోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో కింద చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. వీడియో చూసిన నెటిజన్లు.. ఇద్దరూ భయపడిపోయారంటూ కామెంట్‌ చేస్తున్నారు.అయితే వీరిద్దరిలో ఎవరు ఎక్కువ భయపడ్డారో చెప్పలేమని మరికొందరు అభిప్రాయపడ్డారు. కొంతమంది వీడియోలో కనిపించిన పెద్దాయన పరిస్థితిని వర్ణిస్తుండగా, మరికొందరు పాపం అతన్ని చూసిన కంగుతిన్న ఎలుగుబంటి అదేదో వింత జీవి అనుకున్నట్టుంది.. అంటూ ఫన్నీగా కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!