Viral Video: తగ్గేదే లే అంటున్న బుడ్డోడు.. శ్రీవల్లి పాటకు ఈ కుర్రాడి డాన్స్ అదుర్స్.. నెట్టింట్లో వీడియో వైరల్..
ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప (Pushpa) హావా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో పుష్ప సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. పుష్ప రిలీజ్ అయి రెండు నెలలు గడుస్తున్నా..
ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప (Pushpa) హావా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో పుష్ప సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. పుష్ప రిలీజ్ అయి రెండు నెలలు గడుస్తున్నా.. క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో విడుదలైన రికార్డ్స్ క్రియేట్ చేసింది. దక్షిణాదిలోనే కాకుండా.. ఉత్తరాదిలోనూ పుష్ప కలెక్షన్ల సునామి సృష్టించింది. ఊర మాస్ లుక్‌లో బన్నీ పుష్ప రాజ్ పాత్రలో అదుర్స్ అనిపించాడు. ఇక పుష్పరాజ్ ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక మెప్పించింది. ఇందులో అనసూయ, సునీల్, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించారు. ఇక పుష్ప పాటలకు సామాన్యులే కాదు.. సెలబ్రటీలు, క్రికెటర్స్ స్టెప్పులేస్తున్న వీడియోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా శ్రీవల్లి పాటకు ఓ కుర్రాడు వేసిన డాన్స్ అందరిని ఆకట్టుకుంటుంది.
చత్తీస్‌ఘడ్‌కు చెందిన సహదేవ్ డిర్డో అనే 10 ఏళ్ల బాలుడు గతేడాది విడుదలైన బచ్పన్ కా ప్యార్ పాటలో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత పాట చిత్రాల్లోకి పాటలకు తనదైన స్టైల్లో స్టెప్పులేస్తూ ఇంటర్నెట్లో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తాజాగా ఈ కుర్రాడు.. పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు స్టెప్పులేసాడు. అల్లు అర్జున్ వేసిన శ్రీవల్లి హుక్ స్టెప్ వేసి అదరగొట్టాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ కుర్రాడి వీడియోకు నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు.
View this post on Instagram
Isha Chawla: ప్రేమకావాలి అంటూ ఒకసారి ఎంట్రీ.. డబల్ ధమాకాతో రీఎంట్రీ..’ఇషాచావ్లా’ న్యూ ఫొటోస్..
Meenakshi Chaudhary: అలాంటి సీన్స్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటున్న బ్యూటీ..