Tariff Hike: ఛార్జీల పెంపు బాంబు పేల్చిన టెలికాం దిగ్గజం.. ఎప్పుడంటే..
Rate Hike: మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసిన అనంతరం టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ వినియోగదారులకు బాంబు లాంటి వార్తం చెప్పంది. అదేంటంటే 2022 సంవత్సరంలో మరోసారి రీఛార్జ్ రేట్ల పెంపు... తప్పదు..
Tariff Hike: మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసిన అనంతరం టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ వినియోగదారులకు బాంబు లాంటి వార్తం చెప్పంది. అదేంటంటే 2022 సంవత్సరంలో మరోసారి రీఛార్జ్ రేట్ల పెంపు ఉండనుందని యాజమాన్యం తెలిపింది. రానున్న మూడు నాలుగు నెలల్లో ఛార్జీల పెంపు ఉండకపోయినప్పటికీ.. సంవత్సరాంతంలోపు పెంపు తప్పదని స్పష్టం చేసింది. ఛార్జీల పెంపు నిర్ణయం అనివార్యమని.. ఈ నిర్ణయం అమలులో వెనుకాడేది లేదని ప్రకటించింది.
రానున్న కాలంలో కస్టమర్ నుంచి నెలవారీ వచ్చే సరాసరి ఆధాయాన్ని(ARPU- Average Revenue From User) రూ. 200 లకు తీసుకువెళ్లనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రకటన తరువాత ఎయిర్ టెల్ షేర్ ధర ఎన్ఎస్ఈ లో 1.55 శాతం పెరిగి రూ. 719.90 వద్ద ముగిసింది. గడచిన డిసెంబర్ త్రైమాసికంలో రూ. 830 కోట్లు నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది అంతకు ముందు సంవత్సరం కంటే 3 శాతం తక్కువ. ప్రస్తుతం సగటు వినియోగదారుని నుంచి నెలకు వస్తున్న సరాసరి ఆదాయం రూ. 163 గా ఉంది.
తాజాగా ఎయిర్ టెల్ విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల్లో మంచి ఫలితాల వెనుక గతంలో ఛార్జీల పెంపు ప్రధాన కారణంగా ఉంది. దీనికి తోడు సంస్థలో అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ పెట్టుబడులు పెట్టడం కూడా ఒక కారణంగా నిలిచింది. వీటన్నిటితో పాటు కొత్తగా రూ. 7,500 కోట్లను డెట్ సెక్యూరిటీలు లేదా బాండ్ల విక్రయం ద్వారా సమీకరించాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది.
”ఇప్పటికే పెంచిన ఛార్జీల ప్రయోజనాలు నాలుగో త్రైమాసికంలో కనిపిస్తాయి. భారత్, ఆఫ్రికాలోని టెలికాం వ్యాపారం మంచి పనితీరుకనబరుస్తోంది. మంచి లాభాలను ఆర్జిస్తున్నాం. నిధుల కొరత లేదు. వీటి వల్ల స్పెట్క్రమ్ చెల్లింపులు చేసి వడ్డీ భారాన్ని తగ్గించుకున్నాం.” – గోపాల్ విట్టల్, ఎయిర్ టెల్ సీఈవో
ఇవీ చదవండి..
Telangana: ఆ ఐదుగురు ప్రభుత్వ అధికారులకు జీతాల్లో కోత.. వామ్మో ఆ చట్టం చాలా కఠినం!
Cheap Gold loan: తక్కువ వడ్డీ రేట్లకు గోల్డ్ లోన్ అందిస్తున్న బ్యాంకులు ఇవే..