Gold Rate Today: మగువలకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా..

Latest Gold Price: బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ వినియోగదారులకు షాకిస్తున్నాయి. వాస్తవానికి బులియన్ మార్కెట్‌ (Bullion Market) లో పసిడి, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు

Gold Rate Today: మగువలకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా..
Today Gold Price
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 10, 2022 | 5:34 AM

Latest Gold Price: బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ వినియోగదారులకు షాకిస్తున్నాయి. వాస్తవానికి బులియన్ మార్కెట్‌ (Bullion Market) లో పసిడి, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం అందిరికీ తెలిసిందే. నిత్యం మారుతున్న అంతర్జాతీయ, దేశీయ పరిస్థితులకు అనుగుణంగా బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుతుంటాయి. అందుకే పసిడి ప్రియులు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంటారు. కాగా.. కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు (Gold Price) రోజురోజుకూ పెరుగుతూ షాకిస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.45,550 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,690 గా ఉంది. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.150 పెరిగితే.. 24 క్యారెట్లపై రూ.160 మేర పెరిగింది. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం..

* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,410 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,540 లుగా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,690 వద్ద కొనసాగుతోంది.

* తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,780 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950 వద్ద కొనసాగుతోంది.

* పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,540 వద్ద కొనసాగుతోంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,690 ఉంది.

* కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,690 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

* తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,690 వద్ద కొనసాగుతోంది.

* ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,690 ఉంది.

* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,690 గా ఉంది.

కాగా.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే.. వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:

UP Assembly Election 2022: అందరిచూపు యూపీ‌ వైపే.. తొలి విడత పోలింగ్‌ నేడే.. 58 స్థానాల్లో..

One Digital Id India: ఆధార్, పాన్, పాస్‌పోర్ట్ వంటి పత్రాల ఇబ్బందులకు ఎండ్ కార్డ్.. అన్ని పత్రాలు ఒకే డిజిటల్ IDతో ..