Flying Car Video Viral: హమ్మయ్యా.. ఇకపై ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే.. గాల్లో ఎగిరే కారు వచ్చేసిందోచ్..!
మనం ఎక్కడికైనా అర్జెంట్‌గా బయటకు వెళ్లాలంటే అతిపెద్ద టెన్షన్ ట్రాఫిక్ జామ్. కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలతో ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోవాల్సిందే..! అటువంటి పరిస్థితిలో ఆకాశంలో ఎగిరే శక్తి ఉన్న కారు మనకు ఉంటే బాగుండును.. అనే ఆలోచన చాలాసార్లు మన మనసులోకి వస్తుంది. మీరు కూడా ఇలాగే ఆలోచించిన వారిలో ఒకరైతే ఎగరగలిగే కారు మార్కెట్లోకి రాబోతోందనే శుభవార్త మీ కోసమే..అవును దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Flying Car Video Viral: ఎగిరే కారు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని కాలిఫోర్నియా స్టార్టప్ కంపెనీ అలెఫ్ ఏరోనాటిక్స్ రూపొందించింది. ఈ కంపెనీ ఎగిరే కార్ల గురించి ఆలోచించే వారి కలలను నిజం చేసింది. దీంతో రాబోయే కాలంలో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అనే ఆందోళన నుండి మనకు త్వరలోనే విముక్తి లభించే అవకాశం రానుంది. కాలిఫోర్నియా స్టార్టప్ కంపెనీ అలెఫ్ ఏరోనాటిక్స్ తన ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారు మోడల్ జీరో ను విడుదల చేసింది. ఈ కారు గాల్లో ఎగరగలదు, రోడ్డుపై కూడా పరుగెత్తగలదు. దీని ప్రత్యేకతను చూపించే వైరల్ వీడియో ఇక్కడ చూడండి.
కాలిఫోర్నియా స్టార్టప్ కంపెనీ అలెఫ్ ఏరోనాటిక్స్ ప్రారంభించిన ఈ ఎగిరే కారు పేరు ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్ మోడల్ జీరో అని పెట్టారు. ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే, అది భూమి నుండి పైకి లేచి, కొద్దిసేపటికే గాలిలో ఎగరడం ప్రారంభిస్తుంది. రోడ్డుపై ఆగివున్న వాహనాలను దాటిన తర్వాత అది తిరిగి నేలపైకి వచ్చి తన గమ్యస్థానం వైపు కదలడం ప్రారంభిస్తుంది. ఈ కారు కూడా బ్యాటరీతోనే నడుస్తుందని సమాచారం. ఈ కారు చూడటానికి సాధారణ కారులా కనిపిస్తుంది. కానీ ఎగరడానికి సహాయపడే సీక్రెట్ రోటర్ బ్లేడ్ ఉంది. ఇది ఒక ఎలక్ట్రిక్ కారు. ఇది 320 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. 160 కిలోమీటర్ల వరకు గాల్లో ఎగురుతుంది. ఈ కారు వేగం గంటకు 40 కిలోమీటర్లు.
వీడియో ఇక్కడ చూడండి..
Flying Cars Are Here!
Back to the Future predicted them for 2015. It didn’t happen. But now we’re getting closer.
The dream of flying above traffic is becoming real.
Alef Aeronautics is making this happen with their Model A. pic.twitter.com/NeKgH4lREf
— Alex / AI Experiments (@byalexai) February 24, 2025
ఈ ఎగిరే కారు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది స్పందించారు. మనకు ఎగిరే కార్లు వచ్చే వరకు లేదా కనీసం వాటికి అనుమతులు వచ్చే వరకు ఇంకా సమయం పడుతుందంటూ నెటిజన్లు కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..