Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అయ్యో పాపం.. రైల్వే ప్లాట్‌ఫామ్‌ మెట్లపై పడిపోయిన యువతి..! దగ్గరకెళ్లి చూడగా..

సోషల్ మీడియాలో అనేక రకాల వింత వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒక అమ్మాయి మెట్లపై నుండి పడిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె పడిపోవడం చూసి, అక్కడ కూర్చున్న వారందరూ మొదట భయపడతారు. ఆ తర్వాత నిజం తెలుసుకున్న స్థానికులు ఆ యువతి చేసిన పనికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆ వీడియో వెనుక ఉన్న అసలు వాస్తవం తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు.

Watch: అయ్యో పాపం.. రైల్వే ప్లాట్‌ఫామ్‌ మెట్లపై పడిపోయిన యువతి..! దగ్గరకెళ్లి చూడగా..
Girl Falls
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 23, 2025 | 7:14 PM

ఈ రోజుల్లో యువతలో రీల్స్ క్రేజ్ ఎంతలా ఉందంటే దానికోసం ఏదైనా చేస్తారు. రీల్స్‌ పిచ్చిలో కొందరు కదులుతున్న రైలులో స్టంట్స్‌ చేస్తుంటారు. వేగంగా వెళ్తున్న బైకులు, వాహనాలపై రీల్స్‌ చేస్తూ తమ ప్రాణాలను పణంగా పెడతారు. మరికొందరు నది ఒడ్డున రీల్స్ తయారీ పేరుతో వింతైన పనులు చేస్తారు. ఇక్కడ కూడా ఓ యువతి చేసిన రీల్‌ స్టంట్‌ వైరల్‌గా మారింది. తెల్ల చొక్కా, నల్ల ప్యాంటు ధరించిన ఓ యువతి రైల్వే స్టేషన్‌ మెట్లపై నుండి అకస్మాత్తుగా కిందపడిపోతుంది. ఒక్కో మెట్టు మీద నుండి పడిపోతుండగా ఆమె జుట్టు చిందర వందరగా మారింది. ఇది చూసి సమీపంలో కూర్చున్న వారు కూడా భయపడ్డారు. ఆమెకు తల తిరుగుతోందని, ఆమె కాళ్ళు జారి పడిపోయిందని అందరూ అనుకుంటున్నారు. ఆమె మెట్లపై నుండి కింద పడగానే ఆమె స్పృహ కోల్పోయినట్లుగా పడిపోయింది..దాంతో ఆమెకు సహాయం చేయడానికి అక్కడే ఉన్న ఒక మహిళ ముందుకు వచ్చింది..కానీ, ఆ తర్వాత జరిగిన సీన్‌ చూసి షాక్ అయ్యింది.

ఆ అమ్మాయికి సహాయం చేయడానికి ఒక మహిళ ముందుకు రాగానే, ఆమె అకస్మాత్తుగా లేచి నవ్వడం ప్రారంభించింది. దాంతో ఆమె రీల్ చేయడానికి ఇదంతా చేస్తోందని అందరికీ తెలిసింది. దాంతో ఆమె చేసిన పనికి అక్కడున్న వారంతా కోపంతో ఊగిపోయారు. మహిళ చేసిన పని పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూసిన కొంతమంది నెటిజన్లు.. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వారి పట్ల ఎవరికి సహాయం అవసరమో, ఎవరికి అవసరం ఉండదో తెలియడం లేదంటూ వాపోయారు. ఇలాంటి తెలివితక్కువ పనుల కారణంగా అసలు అవసరం ఉన్నవారి పట్ల నిర్లక్ష్యం వహించే పరిస్థితులు వస్తున్నాయంటూ మండిపడ్డారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..